Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బావా బాహుబలి'... ఈ బావ కోర్కెను తీర్చగలవని ఆశిస్తున్నా : కలెక్షన్ కింగ్

హీరో ప్రభాస్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు బావ అవుతారా? ఏమో.. ఎవరు ఎవరికి ఎలాంటి వరుస అవుతారో ఎవరికి తెలుసు. కానీ, ప్రభాస్‌ను మోహన్ బాబు బావా అని సంభోదించడం ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఆశ

Advertiesment
'బావా బాహుబలి'... ఈ బావ కోర్కెను తీర్చగలవని ఆశిస్తున్నా : కలెక్షన్ కింగ్
, గురువారం, 4 మే 2017 (11:03 IST)
హీరో ప్రభాస్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు బావ అవుతారా? ఏమో.. ఎవరు ఎవరికి ఎలాంటి వరుస అవుతారో ఎవరికి తెలుసు. కానీ, ప్రభాస్‌ను మోహన్ బాబు బావా అని సంభోదించడం ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేనా.. ప్రభాస్ బావా బాహుబలి.. ఈ యేడాదైనా నా కోర్కె తీర్చుతావా అంటూ ట్వీట్ చేయడం, ఇది వైరల్‌గా మారింది. బాహుబలి విజయంపై మోహన్ బాబు చేసిన ట్వీట్లను ఓసారి పరిశీలిస్తే.... 
 
‘బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. ప్రభాస్‌కు విజయీభవ.’
 
అలాగే, బాహుబలి చిత్ర నిర్మాతల గురించి మాట్లాడుతూ.. ‘డియర్ శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని.. నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. ప్రియమైన రానా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు.. దిగ్విజయోస్తు. కీర్.. మరకతమణిగా.. ఎంఎం క్రీమ్‌గా.. కీరవాణిగా.. ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగమతిలోనూ అనుష్కది పవర్ ఫుల్ పాత్రే... త్వరలో టీజర్