Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాసరి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుంది: మోహన్‌బాబు

దర్శకరత్న దాసరి నారాయణ రావు పార్థివదేహాన్ని కడచూపు చూసేందుకు సినీ రంగంలోని కొందరు ప్రముఖులు రాకపోవడంపై నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి దాసరి సహాయం చేశారని, ఎన్నో ఇళ్లలో దీపం వెలిగిం

దాసరి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుంది: మోహన్‌బాబు
, ఆదివారం, 4 జూన్ 2017 (13:00 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు పార్థివదేహాన్ని కడచూపు చూసేందుకు సినీ రంగంలోని కొందరు ప్రముఖులు రాకపోవడంపై నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి దాసరి సహాయం చేశారని, ఎన్నో ఇళ్లలో దీపం వెలిగించారన్నారు. సపోర్టింగ్ పాత్రలు చేసుకునే ఎంతోమందిని ఆయన హీరోలుగా చేశారని.. ఎంతోమంది హీరోయిన్లకు గుర్తింపును తీసుకొచ్చారని చెప్పారు. వారంతా దాసరిగారిని కడసారి చూసేందుకు ఎందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. 
 
తాను ఎవరి పేరును చెప్పనని.. కానీ, వారు చేసింది మాత్రం చాలా దారుణమని తెలిపారు. ఊర్లో లేనివారి గురించి మనం మాట్లాడకూడదని.. అందుబాటులో ఉండికూడా.. రాకపోవడం సరైనది కాదని తెలిపారు. చావు ప్రతి ఒక్కరికీ వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. దాసరి ఎంతోమంది లబ్ధి పొందారని, అలాంటి మనిషి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుందని తెలిపారు.
 
ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దాసరి నారాయణ రావు తానున్నానంటూ పరిష్కారం చూపించేవారన్నారు. దాసరి నారాయణరావుని కూడా ఇండస్ట్రీ ఎప్పుడూ పెద్ద దిక్కుగానే చూసేది. అయితే ఆయన తన సొంత కుటుంబాన్ని మాత్రం సరిగ్గా పట్టించుకోలేదు అనే అపవాదు ఉంది.
 
పెద్ద కొడుకు జీవితం గాలికి వదిలేసారని చాలామంది అంటున్నారు. ఆర్థికంగా ఎన్నో వివాదాలు ఉన్నా దాసరి ఆస్తి పంపకాల విషయంలో కూడా సరిగ్గా ప్రవర్తించలేదని టాక్. దాసరి పెద్ద కొడుకు తారక ప్రభుతో విడిపోయిన అతని భార్య ఆయన మరణం తరువాత మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన మాటలు షాకింగ్‌గా ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో దాసరి ఫ్యామిలీలో పెద్ద గొడవలే మొదలయ్యేలా ఉన్నాయి.
 
అయితే ఇవి అన్నింటినీ హ్యాండిల్ చెయ్యడం కోసం మోహన్ బాబు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. పెద్ద కర్మ పూర్తి అయిన తరవాత స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి అంతా సెటిల్ చేస్తారని టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్‌‌లో మా మధ్య ప్రేమ చిగురించింది.. గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్: చైతూ