Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందరికీ నీతులు చెప్పే వర్మా.. నువ్వు పాటించావా: నిలదీసిన కీరవాణి

ప్రతి ఒక్కరిపైనా ట్విట్టర్‌లో చురకలు వేస్తున్న ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మను తీవ్రంగా విమర్శించారు. మంచి సినిమాలు మాత్రమే చేయాలని తనకు సలహా ఇచ్చిన వర్మ ఆ సలహాను తాను పాటించకపోవడం వల్లే ప్లాఫ్ సినిమాల దర్శకుడిగా పడిపోయాడని కీరవాణి చురకలు వేశారు.

అందరికీ నీతులు చెప్పే వర్మా.. నువ్వు పాటించావా: నిలదీసిన కీరవాణి
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (04:27 IST)
ఉన్నట్లుండి ఆదివారం తన సంగీత దర్శకత్వ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ తన సొంత నిబంధనల మేరకే సంగీత గమనం కొనసాగిస్తానని తన నిర్ణయం మార్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ప్రతి ఒక్కరిపైనా ట్విట్టర్‌లో చురకలు వేస్తున్న ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మను తీవ్రంగా విమర్శించారు. మంచి సినిమాలు మాత్రమే చేయాలని తనకు సలహా ఇచ్చిన వర్మ  ఆ సలహాను తాను పాటించకపోవడం వల్లే ప్లాఫ్ సినిమాల దర్శకుడిగా పడిపోయాడని కీరవాణి చురకలు వేశారు.
 
గతంలో రాముతో నేను కొన్ని సినిమాలు చేశాను. అప్పట్లో ఆర్థిక ఇబ్బందులవల్ల వచ్చే ప్రతి అవకాశాన్ని వదలుకోకుండా తీసుకుని చేసేవాడిని. ఇది సరైన ట్రాక్ కాదంటూ వర్మ క్షణక్షణం వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు మాత్రమే చేయమని నాకు సలహా ఇచ్చారు. అయితే నేనెప్పుడూ ఆయన మాట వినలేదు. కారణం ఆర్థిక దుస్థితి. పైగా మాది పెద్ద కుటుంబం. కుటుంబాన్ని మోయాల్సిన బాధ్యతల కారణంగా అప్పట్లో నా తలుపు తట్టిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుని క్వాలిటీ లేని సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం చేపట్టాను. కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి కూడా. 
 
అయితే చెత్త సినిమాలకు, చెత్త నిర్మాణ సంస్థలకు పని చేయవద్దని నాకు వర్మ సిన్సియర్‌గానే సలహా ఇచ్చారు కాదనను. అయితే నాకు ఇచ్చిన అదే సలహాను ఆయన ఎన్నడూ తర్వాత పాటించలేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే వర్మ ప్రతిభావంతుడు కాబట్టి అనేక ప్లాఫ్స్ తీసిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో అద్భుత మేధావి గానే మిగులుతాడు అంటూ కీరవాణి కితాబిచ్చారు. హీరోలు, దర్శక–నిర్మాతలు, రాజకీయ నాయకులు... వాళ్లూ–వీళ్లూ అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరిపై చురకలు వేయడం వర్మ మానుకుంటే బాగుంటుంది అనే ఆవేదనను కీరవాణి ఈ సందర్భంగా వ్యక్తపరిచారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయిదేళ్ల బాహుబలి యజ్ఞం ముగిసిందా.. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఎవరేమన్నారు?