Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్‌కు లిప్‌లాక్స్ ఇచ్చి ఇంట్లోను భార్యకు ఇచ్చాడు.. బాలీవుడ్ హీరో

Advertiesment
హీరోయిన్‌కు లిప్‌లాక్స్ ఇచ్చి ఇంట్లోను భార్యకు ఇచ్చాడు.. బాలీవుడ్ హీరో
, శుక్రవారం, 9 నవంబరు 2018 (17:03 IST)
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని ఇటు తమిళం, అటు హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తుంటే, హిందీలో మాత్రం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో హీరోయిన్‌తో తీయాల్సిన లిప్ లాక్స్ సీన్లన్నీ పూర్తయ్యాయి. దీంతో షాహిద్ కపూర్‌కు ఆ పాత్ర ఆవహించినట్టుగా ఉంది. చిత్ర షూటింగ్‌లో హీరోయిన్‌కు లిప్‌లాక్స్‌ ఇచ్చి అలవాటైన ఈ హిందీ 'అర్జున్‌ రెడ్డి' ఇంట్లోనూ తన భార్యకు లిప్‌లాక్స్‌ ఇస్తున్నాడు. 
 
ఈ ఫొటోలను అతని సతీమణి మీరా కపూర్‌ 'ప్రేమ ఒక్కటే.. హ్యాపీ దీపావళి' అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఇక ఈ లిప్‌లాక్‌ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ జంటను సమర్ధిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. 
 
'ఇది దీపావళి.. హనీమూన్‌ కాదు' అని ఒకరంటే.. "ఇది థర్డ్‌ క్లాస్‌ దీపావళి.. మీ చర్యతో సిగ్గుపడుతున్నా" అని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దేశ సంప్రదాయాన్ని గంగలో కలుపుతున్నారని, దీపావళికి, వాలెంటైన్స్‌డేకు వ్యత్యాసం లేకుండా పోయిందని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఏది ఏమైనప్పటికీ షాహిద్ కపూర్ తన భార్యకు లిప్ లాక్స్ ఇస్తున్న ఫోటో మాత్రం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ లిప్‌లాక్‌కు 4 లక్షలకు పైగా లైక్స్‌రాగా.. వేల కాంప్లిమెంట్స్‌ రావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..