Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాప్ రారాజు మైఖేల్‌ జాక్సన్ జీవించినపుడే కాదు మరణించాక కూడా సంపాదనపరుడే!

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పాటలు ఇప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. జాక్సన్‌ మనం మధ్య లేకున్నా అతను వాడిన వస్తువులు మాత్రం ఉండిపోయాయి. వాటిని దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. మైకేల్ జా

పాప్ రారాజు మైఖేల్‌ జాక్సన్ జీవించినపుడే కాదు మరణించాక కూడా సంపాదనపరుడే!
, శనివారం, 15 అక్టోబరు 2016 (12:18 IST)
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పాటలు ఇప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉన్నాయి. జాక్సన్‌ మనం మధ్య లేకున్నా అతను వాడిన వస్తువులు మాత్రం ఉండిపోయాయి. వాటిని దక్కించుకునేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. మైకేల్ జాక్సన్ వైట్‌‌గ్లోవ్‌ను వేలం వేశారు. 2009లో జాక్సన్ మూన్ వాక్‌గ్లోవ్‌ను వేలం వేయగా రూ.2 కోట్లకు ఓ అభిమాని చేజిక్కించుకున్నాడు. ఎంజేకు చెందిన మరో గ్లోవ్‌ను 2010లో వేలం వేయగా అది కోటి రూపాయలు పలికిన విషయం తెలిసిందే. 
 
తాజాగా పాప్ రారాజు మైఖేల్‌ జాక్సన్ బతికుండగానే కాదు, మరణించాక కూడా సంపాదనపరంగా మొదటిస్థానంలో ఉన్నాడు. మరణానంతరం కూడా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో అత్యధిక సంపాదనా పరుడిగా నిలిచి వార్తల్లోకెక్కాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక 'టాప్‌ ఎర్నింగ్‌ డెడ్‌ సెలబ్రిటీ' పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
వరుసగా నాలుగో సంవత్సరం కూడా... దివంగత నటుడు మైఖేల్ జాక్సన్ టాపర్‌‌గా నిలవడం విశేషం అని ఫోర్బ్స్‌ ప్రకటించింది. 825 మిలియన్ డాలర్ల ఆదాయంతో మైఖేల్‌ అగ్రస్థానంలో నిలవగా, ఈ యేడాది మరణించిన సంగీత విద్వాంసుడు డేవిడ్‌ బోవీ ద్వితీయ స్థానంలో నిలిచాడు. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్‌ను విక్రయించడం ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా, మిగతా సొమ్ము ఆయన మ్యూజిక్‌ ఆల్బమ్‌ హక్కులను సొంతం చేసుకున్న సోనీ, ఏటీవీ సంస్థల నుంచి రాయల్టీ ద్వారా సమకూరినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. 
 
ఆదాయపన్ను, ఇతర న్యాయ ఖర్చుల చెల్లింపునకు ముందే జాక్సన్ ఆదాయాన్ని లెక్కగట్టామని, వీటన్నింటిని మినహాయిస్తే ఆయన ఆదాయం కొంతమేర తగ్గవచ్చని, అయినప్పటికీ ఆయన టాప్ ర్యాంకులో ఎలాంటి మార్పు చోటుచేసుకోదని ఫోర్బ్స్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా శక్తిని తెలుపుతూ శృతిహాసన్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్