Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్‌తో ముద్దు సీన్.. 19 టేక్‌లు తీసుకున్న హీరో ఎవరు?

చిత్ర పరిశ్రమకు అనేక మంది కొత్తకొత్త హీరోహీరోయిన్లు పరిచయమవుతుంటారు. వారికి సన్నివేశాల్లో ఎలా నటించాలే తెలియదు. దర్శకుడు చెప్పినట్టుగా కూడా చేయలేక పోతున్నారు.

Advertiesment
Metro Shirish
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:17 IST)
చిత్ర పరిశ్రమకు అనేక మంది కొత్తకొత్త హీరోహీరోయిన్లు పరిచయమవుతుంటారు. వారికి సన్నివేశాల్లో ఎలా నటించాలే తెలియదు. దర్శకుడు చెప్పినట్టుగా కూడా చేయలేక పోతున్నారు. ఇందుకు ఉదాహరణే ఈ కొత్త హీరో. హీరోయిన్‌తో ముద్దు సన్నివేశం కోసం ఏకంగా 19 టేక్‌లు తీసుకున్నాడంటే అతని నటన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'మెట్రో' ఫేమ్‌ శిరీష్‌, చాందిని హీరో హీరోయిన్లుగా దర్శకుడు ధరణీధరన్ 'రాజా రంగూస్కి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గత నెలలో సెట్స్‌పైకి వెళ్లి, ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రెండ్రోజుల్లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'రాజా రంగూస్కి' సెట్స్‌లోని విశేషాలను దర్శకుడు మీడియాతో పంచుకున్నారు. అందులో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్‌ ముద్దు సన్నివేశం ఒకటి. ఇంతకీ దర్శకుడు చెప్పిందేమిటంటే... '50 శాతం షూటింగ్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ని కూడా అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం.
 
మా హీరో శిరీష్‌ చాలా బాగా నటిస్తున్నాడు. అతని నటనలో పరిణితి పెరిగింది. అయితే ముద్దు సన్నివేశాల్లో మాత్రం నెర్వస్‌గా ఫీలవుతున్నాడు. హీరోయిన్‌ను ముద్దు పెట్టడానికి 19 టేక్‌లు తీసుకున్నాడంటే మీరే అర్థం చేసుకోండి' అని నవ్వేశారు. ఇంతకీ ఆ హీరోను దర్శకుడు తిట్టాడో మెచ్చుకున్నాడో ఎవరికీ అర్థంకాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నయ్య చిరంజీవి లేకుంటే నేను జీరో : నటుడు నాగబాబు