Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా: గీతా మాధురి

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన

Advertiesment
తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా:  గీతా మాధురి
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (18:26 IST)
ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఈ సంద‌ర్భంగా గీతామాధురి మాట్లాడుతూ `` మెట్రో సినిమాలో ఓ పాట పాడుతూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. సురేష్ కొండేటి గారు  `జ‌ర్నీ`, `పిజ్జా` లాంటి  ఎన్నో హిట్ సినిమాల‌ను అందించారు. ఇప్పుడు `మెట్రో` సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. మ‌హిళలాంతా ఇప్పుడు గొలుసు దొంగ‌ల బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి స్నాచ‌ర్ల‌కి ఎలా గుణ‌పాఠం చెప్పాలో సినిమాలో చ‌క్క‌గా చూపించారు. సినిమా చాలా బాగుంది. తెలుగు ప్రేక్ష‌కులంతా కూడా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ `ఇన్నాళ్లు తెర‌వెన‌క గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై త‌ను క‌నిపించ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం`` అని తెలిపారు. 
 
నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ-``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మార్చి 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యలో నేనుండగా అది ఎలా కనబడుతుంది?