Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైరముత్తుపై లైంగిక ఆరోపణలు... చిన్మయిపై వేటు..

వైరముత్తుపై లైంగిక ఆరోపణలు... చిన్మయిపై వేటు..
, ఆదివారం, 18 నవంబరు 2018 (14:10 IST)
డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, సింగ‌ర్ చిన్మ‌యి సౌత్‌లో మీటూ ఉద్య‌మంపై గళమెత్తింది. ఆమెకి స‌మంత‌, ర‌కుల్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వైర‌ముత్తు స‌మాజంలో మంచి వ్య‌క్తిగా గుర్తింపు తెచ్చుకుంటూ అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని, లిరిక్స్ గురించి వివ‌రించే స‌మ‌యంలో కౌగిలించుకోవ‌డం, వెకిలి చేష్ట‌లు చేయ‌డం వంటి చేసేవాడని చిన్మ‌యి ఇటీవ‌ల త‌న ట్వీట్‌లో తెలిపింది. 
 
ప్రముఖ సినీ గేయరచయిత వైర‌ముత్తుతో పాటు లైంగికంగా వేధించిన ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు కూడా బ‌హిర్గ‌తం చేసింది. అయితే తాజాగా చిన్మయిని తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పిస్తూ త‌మిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా ఆదేశాలు జారీచేశారు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. 
 
'నేను రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్‌ కట్టడంలేదని నన్ను యూనియన్‌ నుంచి తొలగించారు. మ‌రి డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తే గత రెండేళ్లుగా డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ఆమె ప్రశ్నించింది. తమిళ చిత్ర పరిశ్రమ నిబంధనల ప్రకారం డబ్బింగ్‌ యూనియన్‌లో సభ్యత్వం లేకపోతే వారు మనల్ని పని చెయ్యనివ్వరు. నేను రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్‌ కట్టడంలేదని వారు నాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ప్ర‌స్తుతం నేను అమెరికాలో ఉన్నాను. 
 
ఈ స‌మ‌యంలో నేను ఎలాంటి రాత పూర్వ‌క వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌లేను. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌ముఖ పత్రిక‌ని ఆమె కోరింది. నాపై వేటు కొనసాగితే, ఇటీవలి '96' చిత్రంలో త్రిషకు తాను చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని ట్వీట్ చేసింది. చిన్మయిపై తీసుకున్న ఈ చ‌ర్య‌ల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రి ఇది ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సైరా నరసింహారెడ్డి' భార్య సిద్ధమ్మ టీజర్‌ను చూశారా...(Teaser)