Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి సర్జా హఠాన్మరణం.. నేను ఎవరి మాట వినాలో అర్థం కావడం లేదు

Advertiesment
Meghana
, గురువారం, 25 ఆగస్టు 2022 (10:57 IST)
కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటి మేఘనా రాజ్‌, చిరంజీవి సర్జా పెద్దల ఆశీర్వాదంతో 2018 మే 2న పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమయ్యారు.
 
అయితే వీరి పండంటి కాపురాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో.. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో భర్త జ్ఞాపకాల్లోనే బతుకుతూ కొన్ని రోజులు ఇంటికే పరిమితమైంది మేఘన. 
 
అయితే అదే ఏడాది రాయన్‌రాజ్‌ సర్జా పుట్టడంతో మళ్లీ జీవితంపై ఆశలు పెంచుకుంది. తన భర్తకు ప్రతిరూపమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటోంది. ఇదిలా ఉంటే మేఘన రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్దికాలంగా వస్తున్నాయి. తాజాగా ఈ వదంతులపై స్పందించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
 
'కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు. మరికొందరేమో నా కుమారుడిని బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సలహాలు ఇస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలో అర్థం కావడం లేదు. నా భర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు..' మన గురించి ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు. 
 
నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. అయితే మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు' అని చెప్పుకొచ్చింది మేఘన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూసూద్ అదుర్స్.. చిన్నారి జర్నలిస్ట్ బాధ్యత తీసుకున్నారుగా..(video)