Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడుకు లైన్ క్లియర్.. రూ.40లక్షలతో సెటిల్మెంట్!

Advertiesment
Megastar Chiranjeevi's 150th Film Ready to Roll
, ఆదివారం, 12 జూన్ 2016 (17:05 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు సినిమా టైటిల్ వివాదం వదిలేట్లులేదు. తమిళ సినిమా కత్తి సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కథ తనదేనంటూ నరసింహారావు అనే వ్యక్తి సీన్లోకి వచ్చారు. ఈలోపు చిరంజీవి ఆ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో ప్రస్తుతం మెగా క్యాంపులో నరసింహారావుతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిసింది. నరసింహారావు పేరును సినిమా టైటిల్స్‌లో కథా సహకారం అంటూ వేస్తామని, అలాగే రూ.40 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకోవడంతో.. ఇక చిరంజీవి సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకపోవచ్చు.
 
ఇకపోతే.. 150వ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి రానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్‌గా చూపించబోతున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యధార్థ కథతో హార్రర్ మూవీ.. దెయ్యంగా బేబీ సుహాసిని.. 13 ఏళ్ల అమ్మాయి.. కాలిన గాయాలతో?!