Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్జీవీకి నాగబాబు కౌంటర్‌ ఇవ్వడంలో తప్పులేదు.. పవన్ కోసం సురేఖ ఎందుకెళ్తుంది : చిరంజీవి

"ఖైదీ నంబర్ 150"వ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తన సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్‌లో ఎలాంటి తప్పులేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అలాగే, ఈ ఫంక్షన్

ఆర్జీవీకి నాగబాబు కౌంటర్‌ ఇవ్వడంలో తప్పులేదు.. పవన్ కోసం సురేఖ ఎందుకెళ్తుంది : చిరంజీవి
, సోమవారం, 9 జనవరి 2017 (13:06 IST)
"ఖైదీ నంబర్ 150"వ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదికగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తన సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్‌లో ఎలాంటి తప్పులేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అలాగే, ఈ ఫంక్షన్ కోసం మరో సోదరుడు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు తన భార్య సురేఖ ఆయన ఇంటికెళ్లినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. అసలు పవన్‌ను ఆహ్వానించేందుకు సురేఖ ఎందుకు వెళుతుందని ప్రశ్నించారు.
 
ఈనెల 11వ తేదీన తాను నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోమవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో తమ గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యామని చెప్పారు. కానీ, దీనిపై తాను ఎలాంటి భావన వ్యక్తం చేయలేదన్నారు. కారణం.. తనది సున్నిత మనస్తత్వమన్నారు. 
 
ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనస్తత్వం ఉంటుందన్నారు. అలాంటివారిలో నాగబాబు ఒకరన్నారు. అందుకే అతను ఇపుడు ఆర్జీవీ వ్యాఖ్యలపై మండిపడ్డారని, ఇందులో తప్పులేదని చిరంజీవి స్పష్టంచేశాడు. అసలు మీ మధ్య గొడవ ఎందుకు వచ్చిందనే విషయంపై ప్రశ్నించగా, చిరంజీవి సమాధానం చెప్పకుండా దాటవేశాడు. 
 
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉందన్నారు. అందువల్ల ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటీపడటంతో తప్పులేదన్నారు. పైగా ఇది యాదృచ్ఛికమన్నారు. సాధారణంగా ప్రతి రంగంలో పోటీ ఉంటుందన్నారు. మా ఫ్యామిలీ హీరోల మధ్య కూడా పోటీ ఉందని, కానీ అది హెల్తా కాంపిటీషన్ అని చెప్పారు. ప్రతి ఒక్కరు మరొకరితో తమ కథల గురించి చర్చించుకుంటారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ అనేది సువిశాలమైనదని, ఇక్కడకు ఎంతమందైనా రావొచ్చన్నారు. 
 
ఇకపోతే.. నేటితరం యువ హీరోల మధ్య స్నేహం సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ముఖ్యంగా.. రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబుల మధ్య ఫ్రెండ్‌షిప్ బాగానే ఉందన్నారు. దీనికి నిదర్శనమే ఇటీవలి వారిద్దరు విదేశాలకు హాలీడ్ ట్రిప్‌గా వెళ్లారని చిరంజీవి గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ హర్ట్ చేసేలా ఉంటున్నాయన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా రాయడం మంచి పరిణామం కాదన్నారు. ఇలాంటి కామెంట్స్ రాయడం మంచిదా కాదా అనేది వారి విజ్ఞతకే వదిలివేస్తానని చెప్పారు.
 
ముఖ్యంగా ఖైదీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హీరో పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు తన భార్య సురేఖ అతని ఇంటికెళ్లినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ రాశారని, అసలు పవన్ ఇంటికి తన భార్య సురేఖ ఎందుకు వెళుతుందని, ఇలాంటి ఆలోచనలు తమలో లేవని, మీకెందుకు వస్తాయని ప్రశ్నించారు. పైగా, తామంతా బాగానే ఉన్నామని చిరంజీవి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి వార్‌లో 15 సార్లు తలపడిన చిరంజీవి - బాలకృష్ణ... పైచేయి ఎవరిది?