Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమర్షియల్ యాడ్స్‌లో మళ్లీ మెరవనున్న మెగాస్టార్?

Advertiesment
కమర్షియల్ యాడ్స్‌లో మళ్లీ మెరవనున్న మెగాస్టార్?
, బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (15:53 IST)
మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్‌ యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో చిరంజీవి చేసిన థమ్స్ అప్ యాడ్ అయితే ఎవర్ గ్రీన్. కానీ సినిమాలకి బ్రేక్ ఇచ్చాక కమర్షియల్ యాడ్స్‌కి దూరమయ్యారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినట్టే యాడ్స్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అవుతున్నారని సమాచారం.
 
ఇప్పటికే చిరంజీవిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్‌గా అడగడంతో ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ కూడా జరగనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 
ఇదే కనుక నిజమైతే 13 ఏళ్ల తర్వాత మళ్ళీ మెగాస్టార్ కమర్షియల్ యాడ్స్‌లో మెరవనున్నారు. చిరంజీవి యాడ్స్ చేస్తున్నారు అంటే కంపెనీలన్నీ చిరంజీవి కోసం క్యూ కట్టడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. ఇకపోతే.. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 7 సినిమాలు ఉన్నాయి. 
 
అందులో ‘ఆచార్య’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉండగా మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరో మూడు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్. వీటితో పాటు ప్రస్తుతం కమర్షియల్ యాడ్ కంపెనీలు కూడా చిరంజీవి వెంట పడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి?