Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను ఇంట్లో అందరూ ఎదవ అని పిలుస్తారు : వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఆనందంలో ఉన్న వరుణ్ తేజ్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Advertiesment
నన్ను ఇంట్లో అందరూ ఎదవ అని పిలుస్తారు : వరుణ్ తేజ్
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (09:11 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం "తొలిప్రేమ". ఈ చిత్రం ఈనెల పదో తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఆనందంలో ఉన్న వరుణ్ తేజ్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 'నన్ను ఇంట్లో నాన్న ఎదవ అని పిలుస్తుంటాడు. అమ్మ వరుణ్ బాబూ అంటుంది. ఇంకా చాలానే ముద్దుపేర్లున్నాయి' అని చెప్పాడు.
 
తాను హైదరాబాద్, యూసఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చేసిన తాను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉన్నానని, ఎవరైనా అమ్మాయి దొరికితే చెబుతానని అన్నాడు. ఇకపోతే, ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, అతని కన్నా ఒక అంగుళం ఎక్కువ ఎత్తే ఉన్నానని అన్నాడు. తన వయసును దాచుకోబోనని 1990 జనవరి 19న పుట్టిన తనకిప్పుడు 28 ఏళ్లని చెప్పాడు. 'ఘాజీ' చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌కు కమలనాథులు గాలం వేయొచ్చు : కమల్ హాసన్