సాయిపల్లవి కోసం థియేటర్ల వద్ద క్యూకట్టిన అభిమానులు
						
		
						
				
'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సాయిపల్లవి. తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్‌లు అందరినీ కట్టిపడేశాయి. యువ హీరోయిన్లలో ఇప్పుడు టాప్ సాయిపల్లవే. ఫిదా తరువాత ఆమె నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. నానితో కలిసి
			
		          
	  
	
		
										
								
																	'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సాయిపల్లవి. తెలంగాణా యాసలో అందరినీ ఆకట్టుకునేలా సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్‌లు అందరినీ కట్టిపడేశాయి. యువ హీరోయిన్లలో ఇప్పుడు టాప్ సాయిపల్లవే. ఫిదా తరువాత ఆమె నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. నానితో కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలై భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. థియేటర్ల వద్ద ఏ అభిమానిని అడిగినా సాయిపల్లవి ఈ సినిమాలో ఉందిగా అందుకే సినిమా చూడటానికి వచ్చాము అని చెబుతున్నారు.
	
 
									
										
								
																	
	 
	మరోవైపు నాని కోసం కాలేజీ అమ్మాయిలు థియేటర్లకు భారీగా వస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబడుతోంది. 21వ తేదీ మొదటిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లోను 12 కోట్ల 26 లక్షల రూపాయల వసూళ్ళను రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల రూపాయలను వసూలు చేసింది. విదేశాల్లో కూడా సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. అభిమానుల అంచనాను మించి సినిమా ఉండటంతో అభిమానులు థియేటర్ల వద్ద క్యూకడుతున్నారు. ఏ షో చూసినా హౌస్‌ఫుల్ బోర్డే కనిపిస్తోంది.