Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మావాడు నాకు బాగుంటాడు. అస‌లు విష‌యం మీరే చెప్పాలిః రాజమౌళి

మావాడు నాకు బాగుంటాడు. అస‌లు విష‌యం మీరే చెప్పాలిః రాజమౌళి
, సోమవారం, 22 మార్చి 2021 (07:46 IST)
Tellarithe guruvaram, prerelease
‘సినిమా రిచ్‌గా తీశాం. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. అయితే ఇంట్లో వాళ్లు ఏ కొంచెం చేసినా కూడా బాగుందని మాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం మీరు శుక్రవారం చెప్పాలి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్ మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడి గురించి మీరు చెప్పాలి. ట్రైలర్, టీజర్ చూస్తేనే సినిమా చాలా రిచ్‌గా ఉందని తెలుస్తోంది. నిర్మాతలు అద్భుతంగా నిర్మించారు.మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు’ అని రాజమౌళి అన్నారు.
తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్నిమార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సంద‌ర్భంగా మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
దర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ.. ‘మార్చి 27న తెల్లవారితే గురువారం మూవీ రాబోతోంది. యూత్ అయితే అరవింద సమేతతో వెళ్లండి.. ఫ్యామిలీ అయితే సకుటుంబ సమేతంగా రండి. సినిమాను చూస్తే అదుర్స్ అనిపించేలా చేస్తాం. నా మొదటి సినిమాకు తారక్ అన్న గెస్ట్‌లా రావడం కలలా ఉంది. నేను దేవుడిని నేను బాగా నమ్ముతాను. అందులో ఒకరు సింహాచలంలో ఉంటే.. ఇంకొకరు కేరళ శబరిమలైలో ఉన్నారు. కానీ నేను అభిమానించే హీరో ఆంద్రలో సింహాద్రిలా కేరళలో సింగమలైలా ఉంటారు. తెల్లవారితే గురువారం అనే సినిమాకు వస్తే.. ఉదయం 4 40 నిమిషాలకు వరుడు వీరేంద్ర పెళ్లి. కానీ ఎవరో తెలీదు’ అని చెప్పుకొచ్చారు.
 
కీరవాణి మాట్లాడుతూ.. ‘ఇది మా అబ్బాయి రెండో సినిమా. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా మూడో సినిమా అయినా కూడా దర్శకులు  చెప్పింది విని స్టూడెంట్స్‌లా ఎంతో నేర్చుకోవాలి.. అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ అయిన ఎన్టీఆర్ ఆశీర్వదించేందుకు వచ్చారు. సినిమాకు మంచి రిపోర్ట్ వస్తే.. సాయి గారు మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వస్తాను. మంచి ఒగ్గాణి తినిపించాలి. సింహా, భైరవ ఆల్ ది బెస్ట్. ఫాదర్స్ రెండు రకాలుగా ఉంటారు. గూగుల్ మ్యాప్ ఫాదర్... ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్రతీ ఒక్కటి చెబుతుంటారు. కానీ రెండో రకం మాత్రం.. కేవలం ఆల్ ది బెస్ట్.. కమ్ బ్యాక్ సేఫ్ అని చెబుతారు. నేనూ అదే చెబుతాను. కెరీర్ ‌ ప్రారంభించినప్పుడే సింహా, భైరవకు అన్నీ చెప్పాను. ఈ సినిమా కథ కూడా నాకు తెలీదు.. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
నవ్వి నవ్వి కింద పడిపోతారు..
ఎడిటర్ సత్య మాట్లాడుతూ.. ‘సినిమా నిడివి రెండు గంటలే. చిత్రాన్ని పరిగెత్తించాం. థియేటర్లో ప్రేక్షకులు నవ్వి నవ్వి కింద పడిపోతారు’ అని చెప్పుకొచ్చారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జక్కన్న ఫ్యామిలీ నాకు దేవుడిచ్చిన వరం : జూనియర్ ఎన్టీఆర్