Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

Varun Tej at vijayawada

డీవీ

, శనివారం, 5 అక్టోబరు 2024 (17:57 IST)
Varun Tej at vijayawada
వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం మట్కా కోసం ఇంతకు ముందు చేయని ప్రయత్నం చేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు SRT ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మట్కా కింగ్‌గా ఎదిగిన ఒక సాధారణ వ్యక్తి యొక్క ప్రయాణాన్ని వివరిస్తుంది. శనివారంనాడు విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో మట్కా టీజర్ విడుదలయింది. 
 
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, అమ్మవారి దీవెనలు కావాలని విజయవాడలో మా సినిమా టీజర్ ను విడుదల చేయాలనుకున్నాం. అందులోనూ  మీ అందరి చేతులద్వారా విడుదలచేయడం ఆనందంగా వుంది.  అభిమానులు మా కుటుంబ సభ్యులు, మీరు మా బాబాయ్, పెద్దనాన్నను ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్స్.  నేను గద్దల కొండ గణేష్ సినిమా చేశాక  అలాంటి సినిమాలు చేయాలని చాలా మంది అడిగారు. నానుంచి అలాంటి సినిమా ఆశించే వారికి మట్కా వుంటుంది. మాస్, ఫైట్స్ కాకుండా  1960లో వైజాగ్ లో జరిగే కథ. టీజర్ లో కొంత చూశారు.  ట్రైలర్ తర్వాత కథ గురించి ఇంకా విషయాలు తెలుస్తాయి. టీజర్ లో చివరిలో నా భుజం మీద ఎర్రతుండు పడుతుంది. సినిమాలో మార్కెట్ లో పనిచేస్తుంటాను. ఓ  ఫైట్ సీన్ లో ఏదో మిస్ అవుతుందే అనుకుంటుండగా టెక్నికల్ టీమ్ లో ఒకతను ఎర్రకండువ మెడలో వేశారు. అది హైలైట్ అవుతుంది. మా అభిమానులైన కుటుంబసభ్యులకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను. గర్వంగా చెప్పుకోదగ్గ  సినిమా  మట్కా అవుతుంది అని చెప్పగలను అని అన్నారు.
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలో మీ ముందు రిలీజ్ చేయాలని టీజర్ రిలీజ్ చేశాం. వరుణ్ గారిని ఇప్పటివరకు చూడని విధంగా చూస్తారు. నవంబర్ 14న థియేటర్ లో సినిమా చూడండి అన్నారు.
 
నిర్మాత  రజనీ తాళ్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా కథను దర్శకుడు వరుణ్ తేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని రాశారు. వరుణ్ చాలా బాగా చేశారు. ఇందులో 6 సాంగ్ లు, 9 ఫైట్లు వున్నాయి. నవంబర్ 14న సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.
 
మరో నిర్మాత డా. విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ, కరుణ్ కుమార్ కథ చెప్పినప్పుడు వరుణ్ కోసం అన్నట్లు అనిపించింది. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్.  ఇంతకుముందు ఓ లెక్క. ఈ  సినిమా  నుంచి వరుణ్ కటౌట్ మరో లెక్క అన్న చందంగా వుంటుంది. ఈ  సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్