Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ లేకుండా నేను లేను... ఆయన్నే పెళ్లి చేసుకుంటా.. బైఠాయించిన మహిళ

సినీ నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ తనని పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని పవన్‌కల్యాణ్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నాకు దిగింది. కొండాపూర్‌కు చెందిన జ్యోతి మధ్యాహ్నం 12 గ

పవన్ లేకుండా నేను లేను... ఆయన్నే పెళ్లి చేసుకుంటా.. బైఠాయించిన మహిళ
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (09:23 IST)
సినీ నటుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ తనని పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని పవన్‌కల్యాణ్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నాకు దిగింది. కొండాపూర్‌కు చెందిన జ్యోతి మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యాలయం వద్ద బైఠాయించింది. తాను పవన్‌ను కలవాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.
 
ఇప్పటికే వివాహ విషయంలో పలు మార్లు విఫలమైన పవన్ ఇప్పుడు మరొక యువతి పవన్ నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ ధర్నాకు దిగడం పవన్ కార్యాలయ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. సిబ్బంది పవన్ లేరని చెప్పినా వినకుండా రాత్రి 8 గంటల వరకు అక్కడే కాపు కాస్తూ ఉండిపోయింది.
 
తనను పవన్ పెళ్లి చేసుకోవాలని ఆమె అనడంతో మానసికస్థితిపై అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెను సముదాయించి, స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఈగ'కు సీక్వెల్‌ వస్తుందా? రాజమౌళితో బాగా కనెక్ట్ అయ్యా: నాని