Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఈగ'కు సీక్వెల్‌ వస్తుందా? రాజమౌళితో బాగా కనెక్ట్ అయ్యా: నాని

'దెయ్యం', 'భూతం', యాక్షన్‌ సినిమాలకు సీక్వెల్‌ చేసేయొచ్చు. ప్రస్తుతం అలాంటి ఆలోచనలే నానికి వచ్చింది. 'ఈగ'కు సీక్వెల్‌ చేస్తే.. బాగుంటుందని మనసులోని మాట చెబతున్నాడు. రాజమౌళి కెరీర్‌ 25 ఏళ్ళు పూర్తయిన స

'ఈగ'కు సీక్వెల్‌ వస్తుందా? రాజమౌళితో బాగా కనెక్ట్ అయ్యా: నాని
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (09:21 IST)
'దెయ్యం', 'భూతం', యాక్షన్‌ సినిమాలకు సీక్వెల్‌ చేసేయొచ్చు. ప్రస్తుతం అలాంటి ఆలోచనలే నానికి వచ్చింది. 'ఈగ'కు సీక్వెల్‌ చేస్తే.. బాగుంటుందని మనసులోని మాట చెబతున్నాడు. రాజమౌళి కెరీర్‌ 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకున్నాడు. నాని దర్శకుడు రాజమౌళికి వీరాభిమాని. అందుకే  'మజ్ను'లో రాజమౌళి నటించాడు. మా ఇద్దరికి బాగా కనెక్ట్‌ అయింది. గొప్ప దర్శకుడు నా సినిమాలో చేయడం హ్యాపీగా వుంది. 
 
అలాగే ఆయన దర్శకత్వంలో  'ఈగ' సినిమాకి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని అన్నారు. 2012 లో రాజమౌళితో చేసిన చిత్రం 'ఈగ'తో అతని దశ తిరిగిందనే చెప్పాలి. ఆ తర్వాత నానై హీరోగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనకు అంత మంచి లైఫ్‌ ఇచ్చిన 'ఈగ' సినిమాకి సీక్వెల్‌‌గా 'ఈగ 2' తీయాలని, అది రాజమౌళికే సాధ్యమని, తాను ఎప్పుడు ఆయన్ను కలిసినా ఇదే మాట సరదాగా అడుగుతుంటానని నాని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ లేని "మహాభారతం" లేదు... తేల్చి చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి