Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వచ్ఛమైన ప్రేమకథతో "మరల తెలుపనా ప్రియా..​​​​​​​​​​​​".. జూలై నెలాఖరులో రిలీజ్

Advertiesment
Marala Telupana Priya
, మంగళవారం, 5 జులై 2016 (13:15 IST)
ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌‌లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం 'మర‌ల తెలుపనా ప్రియా`. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొస‌రాజు ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుందంటూ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు.
 
ఈ సందర్భంగా మ్యూజిక్ దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ మరల తెలుపనా ప్రియా పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా గత చిత్రాల పాటలను ఆదరించిన విధంగానే ఈ సినిమా పాటలను కూడా ఆదరించారు. డైరెక్టర్ సినిమా కథను నెరేట్ చేసి ఆమెకు ఎలాంటి సంగీతం కావాలో దాన్ని రాబట్టుకున్నారు. ప్రతి సాంగ్ కు మంచి సాహిత్యం కుదిరింది. దర్శకురాలే ఓ పేథాస్ సాంగ్‌ను రాశారు. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా దర్శకురాలికే దక్కుతుందన్నారు. 
 
దర్శకురాలు వాణి.యం.కొస‌రాజు మాట్లాడుతూ, ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. శేఖర్ చంద్రగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి మ్యూజిక్ కావాలని ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన చాలా ఓపికగా మంచి సంగీతాన్ని ఇచ్చారు. లిరిక్ రైటర్స్ చక్కని సాహిత్యాన్ని అందించారు. నేను కూడా ఓ పేథాస్ సాంగ్ రాశాను. ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం భిన్న‌మైన వ్య‌క్తిత్వాలు నేప‌థ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మ‌ద్య సాగే ప్రేమ‌కథ. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు. స్త్రీ అయినా నాకే అది నచ్చలేదు. స్త్రీ, పురుషులెవరైనా ప్రేమ స్వచ్ఛంగానే ఉండాలి. ఈ విషయాన్ని నేను సినిమాగా చూపిస్తున్నాను. నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. 
 
ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌, సుజో మ్యాథ్యూ, సమీర్‌, సన, రవివర్మ, పావనీ రెడ్డి, ఈ రోజుల్లో ఫేమ్‌ సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్‌: పి.యస్‌. వర్మ, ఫైట్స్‌: సతీష్‌, కెమెరా: ఎస్‌. రాజశేఖర్‌, ఎడిటర్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కె. సురేష్‌బాబు, శ్రీనివాస్‌ వుడిగ, నిర్మాణం: శ్రీ చైత్ర చలన చిత్ర, కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్‌-దర్శకత్వం: వాణి. ఎమ్‌. కొసరాజు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రిష కెరీర్‌లోనే భిన్న కోణాలు కలిగిన చిత్రం 'నాయకి'.. 15న రిలీజ్!