ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సౌత్ హీరోయిన్...

ఆదివారం, 20 అక్టోబరు 2019 (12:31 IST)
దక్షిణాది సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో మంజిమా మోహన్ ఒకరు. సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అయితే, ఈమె ఓ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిందట. 
 
ఇదే అంశంపై ఆమె సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. కొన్ని వారాల క్రితం తన జీవితంలో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోగా, కాలికి బలమైన గాయం తగిలినట్టు చెప్పింది. 
 
దీనివల్ల కాలికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టమైన ఘటన ఏదని చాలా మంది అడిగారని, ఇప్పుడు దానికి సమాధానం తన వద్ద ఉందని చెప్పుకొచ్చింది.
 
తనకెంతో ఇష్టమైన నటనకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తోందని చెప్పింది. కారణం లేకుండా ఏదీ జరగదని నమ్ముతున్నానని, తనకు లభించిన ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రం ప్రారంభం