Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

కోలీవుడ్ దర్శకులకు పార్టీ ఇచ్చిన మణిరత్నం

Advertiesment
kollywood directors
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (15:59 IST)
పలువురు కోలీవుడ్ దర్శకులకు దిగ్గజ దర్శకుడు మణిరత్నం గ్రాండ్ పార్టీ ఇచ్చారు. గురువారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీకి శంకర్, శని, లింగుస్వామి, గౌతం మీనన్, కార్తీక్ సుబ్బురాజ్, మురుగదాస్, లోకేశ్ కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫొటోని దర్శకుడు శంకర్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. 
 
'ఈ సాయంత్రాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మణిరత్నం సర్‌కు ధన్యవాదాలు. టాలెంట్‌ ఉన్న ఫిల్మ్‌ మేకర్స్‌ను కలవడం.. మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం.. జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌ ఎవర్‌గ్రీన్‌ పాటలను కార్తిక్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ క్షణాలు నిజంగానే ఎంతో విలువైనవి. మంచి ఆతిథ్యాన్ని అందించిన సుహాసినికి ధన్యవాదాలు' అని ఆయన పోస్ట్‌ పెట్టారు. శంకర్‌ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 
 
నిజానికి తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర, యువ దర్శకులందరితో మణిరత్నం నిరతరం టచ్‌లోనే ఉంటారు. కొవిడ్‌ సమయంలోనూ ఆయన తమిళ దర్శకులందరికీ జూమ్‌ కాల్‌ చేసి.. కాసేపు సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేశారు. తాజాగా ఆయన కోలీవుడ్‌ దర్శకులందరికీ స్పెషల్‌ పార్టీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే, తాజాగా మణిరత్నం ఇచ్చిన పార్టీకి ఓ సందర్భంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దర్శకుడు శంకర్ ఇండస్ట్రీలోకి వచ్చి 30 యేళ్ళు పూర్తయిది. ఈ సందర్భంగా ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో చిత్రం