'16' ట్రైలర్‌కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అభినందన...
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం చిత్రాల్లోవిభిన్నమైన పాత్రల్లో నటించి తనదైన గుర్తింపు పొందిన విలక్షణ నటుడు రెహమాన్. రీసెంట్‌గా తమిళంలో సూపర్‌హిట్ మూవీ `ధృవంగళ్ పదినారు`.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం చిత్రాల్లోవిభిన్నమైన పాత్రల్లో నటించి తనదైన గుర్తింపు పొందిన విలక్షణ నటుడు రెహమాన్. రీసెంట్‌గా తమిళంలో సూపర్‌హిట్ మూవీ `ధృవంగళ్ పదినారు`. ఈ సినిమాతో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహమాన్. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై తెలుగులో `16` అనే పేరుతో చదలవాడ బ్రదర్స్ విడుదల చేస్తున్నారు.
తెలుగులో ఇటీవల విడుదల 16 సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి స్పందన వస్తోంది. సినీ ప్రముఖులందరరూ ఈ సినిమా ట్రైలర్ బావుందని అభినందిస్తున్నారు. `16 ట్రైలర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది.. రెహమాన్ ఈ చిత్రం హిట్‌తో మళ్ళీ ఇండస్ట్రీకి బ్యాక్ అయ్యారు` అంటూ రాకింగ్ స్టార్ మంచు తన ట్విట్టర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు. కార్తీక నరేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో మార్చి 9న విడుదలవుతుంది.