Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమలాపాల్‌కు మమత మద్దతు: మహిళలు అణకువగా ఉండాలా.. కుక్కపిల్లను పెంచుకోండి!

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలాపాల్‌కు సింగర్, హీరోయిన్ మమత మోహన్ దాస్ మద్దతు పలికింది. మహిళలు అణకువగా ఉండాలంటే కుక్కపిల్లను తెచ్చి పెంచుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు

అమలాపాల్‌కు మమత మద్దతు: మహిళలు అణకువగా ఉండాలా.. కుక్కపిల్లను పెంచుకోండి!
, సోమవారం, 8 ఆగస్టు 2016 (16:13 IST)
ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలాపాల్‌కు సింగర్, హీరోయిన్ మమత మోహన్ దాస్ మద్దతు పలికింది. మహిళలు అణకువగా ఉండాలంటే కుక్కపిల్లను తెచ్చి పెంచుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు. ప్రేమ వివాహం చేసుకున్న రెండేళ్లకే విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోయిన అమలాపాల్, డైరక్టర్ విజయ్‌ల వ్యవహారం కోలీవుడ్‌ను షేక్ చేస్తున్న తరుణంలో.. మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. మహిళలకు వివాహ జీవితం అనేది సంతోషకరమైన విషయం. 
 
అయితే భార్యగా మారిన మహిళకు భర్తను, పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ భర్తలు తమకు భార్యలైన హీరోయిన్లను వంట చేసిపెట్టడం కోసం, బట్టలుతికివ్వడం కోసం, కుటుంబ వ్యవహారాలు చూసుకునేందుకు వివాహం చేసుకుంటున్నారు. వీటిలో ఏది తగ్గినా అసంతృప్తే. ఒకవేళ ఈ విషయంలో సంతృప్తి చెందితేనే హీరోయిన్లైన వారిని పనులకు పంపిస్తున్నారని మమతా మోహన్ దాస్ గుర్తు చేశారు. ప్రస్తుతం హీరోయిన్లు అభద్రతాభావానికి లోనవుతున్నారన్నారు. ఇక మహిళలు అణకువగా ఉండాలని ఎవరైనా భావిస్తే.. కుక్కపిల్లలను పెంచుకోవచ్చునన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు లక్ష్మీ... మరీ ఏంటిది...? పెళ్లికొడుకు క్రిష్ తొడపైనే కూర్చుని...?