Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడలి అలను.. మనసు స్వేచ్ఛను... ఎవరూ ఆపలేరు... మళ్లీ మళ్లీ చూశా ట్రైలర్

Advertiesment
కడలి అలను.. మనసు స్వేచ్ఛను... ఎవరూ ఆపలేరు... మళ్లీ మళ్లీ చూశా ట్రైలర్
, మంగళవారం, 22 జనవరి 2019 (12:14 IST)
యువ హీరోహీరోయిన్లు అనురాగ్ కొణిదెన - శ్వేతా అవస్థి జంటగా నటించిన చిత్రం మళ్లీ మళ్లీ చూశా. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. సాయిదేవ రమణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోటేశ్వర రావు నిర్మించారు. 
 
ఈ చిత్రం టైటిల్‌కి తగినట్టుగానే ప్రేమ భావనలకు సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్‌ను కట్ చేశారు. 'పక్షులు ఆకాశంలోనే ఎగరాలి.. ఆడిటోరియంలో కాదు. అలాగే మనుషులు కూడా మనస్ఫూర్తిగానే బతకాలి.. మనీస్ఫూర్తిగా కాదు" అంటూ చెప్పే డైలాగు, "కడలి అలను .. కాలం పరుగును.. మనసు స్వేచ్ఛను ఎవరూ ఆపలేరు" అనే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు.. ''విశ్వాసం'' అజిత్ క్లారిటీ