రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఇంటి నెం.13'. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
అలాగే ఇటీవల ఈ సినిమా కోసం శ్రీయా గోషల్ పాడిన 'పో పోవే...' అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఇంటి నెం. 13 చిత్రంలోని మరో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.
డిఫరెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాటను పాడడం విశేషం. 'నర నరము..' అంటూ రాంబాబు గోశాల రచించిన ఈ పాటకు వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందించారు. ఎంతో హుషారుగా సాగే ఈ పాట యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.