Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భావన కేసు.. పల్సర్ సునీల్ లొంగిపోయాడు... రాజకీయ నేతల ప్రమేయముందా?

మలయాళ నటి భావన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న ఈ కేసులో కీలక నిందితుడు సునీల్ అలియాస్ పల్సర్ సునీల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అద

Advertiesment
Bhavana Kidnap Case
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:42 IST)
మలయాళ నటి భావన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న ఈ కేసులో కీలక నిందితుడు సునీల్ అలియాస్ పల్సర్ సునీల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఘటన జరిగిన ఆరు రోజులకు తర్వాత సునీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 
 
మరోవైపు భావన కేసు తొలుత రౌడీ మూక చర్యగా అనుకున్న కేసు కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. కేరళ రాజకీయ నాయకులు ఎవరికి వారు ఇప్పుడు ఈ కేసును తమకు అనుకూల అస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట డ్రైవర్ వేధింపుల కోణం మాత్రమే వెలుగు చూసింది తర్వాత నటుడు దిలీప్‌తో సదరు హీరోయిన్‌కు ఉన్న విభేదాలే కారణమని ప్రచారం జరిగింది. 
 
కానీ పోలీసులు పల్సర్ సునీల్‌ను అరెస్ట్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. కానీ అతడే లొంగిపోవడంతో ఈ కేసుపై దర్యాప్తు పోలీసులకు సులువైంది. మరోవైపు ఈ కేసుపై రాజకీయ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది సాదాసీదాగా జరిగిన దాడి కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటిపై దాడి వెనుక ప్రముఖ సీపీఎం నేత కుమారుల హస్తం ఉందని కేరళలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సీఎం మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"విన్న‌ర్" చిత్రం ద్వారా ప‌రిచ‌యం కానున్న పీట‌ర్‌ హెయిన్స్