Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూత.. సినీ ప్రస్థానం ఇదో

Advertiesment
pratap
, శుక్రవారం, 15 జులై 2022 (11:45 IST)
pratap
ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ (70) ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
దక్షిణాది సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ప్రతాప్ హిందీతో కలిపి ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించాడు. 
 
కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా పలు విభాగాల్లో పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు
 
ప్రతాప్ ముంబైలో తొలుత ప్రముఖ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ పనిచేశాడు. ఈ తరువాత "ఆరవం" సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండవ సినిమా "తకరా"తో బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అందుకున్నాడు. 
 
ఆరోహణం, పన్నీర్ పుష్పంగళ్, తన్మాత్ర, 22 ఫీమేల్ కొట్టయమ్‌, బెంగళూర్ డేస్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో ఆకలిరాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో జీవా, వెట్రీ విలా వంటి తదితర సినిమాల్లో కనిపించారు. 
 
చివరగా ఈయన "సీ.బి15 :ది బ్రెయిన్" సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి షూటింగ్ దశలో ఉంది. 
 
ప్రముఖ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ని 1985లో పెళ్ళి చేసుకున్నాడు. అదే ఏడాదిలోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు అమల సత్యనాథ్‌ను పెళ్ళి చేసుకున్నారు. 
 
22 సంవత్సరాల తర్వాత 2012లో వీరిద్దరు విడిపోయారు. దర్శకుడిగా పోతెన్ మొదటి చిత్రం "మీండుమ్ ఒరు కాతల్ కథై" సినిమాను రాధికాయే నిర్మించింది. ఇక రెండవ సినిమాకే దర్శకుడిగా పోతెన్‌ ఫిలిం ఫేర్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈయన 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నా, పెళ్లెప్పుడో తెలీదు: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ