Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహ బంధానికి మంగళం పాడినట్టే.. కౌన్సిలింగ్‌కు హాజరు

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాల పెళ్ళి బంధానికి తెరపడేలా వుంది. తమ 17 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు గతంలో ప్రకటించిన మలైకా దంప

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహ బంధానికి మంగళం పాడినట్టే.. కౌన్సిలింగ్‌కు హాజరు
, బుధవారం, 30 నవంబరు 2016 (14:31 IST)
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాల పెళ్ళి బంధానికి తెరపడేలా వుంది. తమ 17 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు గతంలో ప్రకటించిన మలైకా దంపతులు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
 
విడాకులకు దరఖాస్తు చేసుకున్న వారు ఆరు నెలలపాటు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ సెషన్స్‌కి హాజరుకావాలి. ఈ కౌన్సిలింగ్‌లో ఇద్దరూ కలిసి జీవించేందుకు సుముఖంగా లేరని తెలిస్తే విడాకులు మంజూరవుతుంది. కాగా మలైకా, అర్బాజ్‌లకు 1998లో వివాహం జరిగింది. వీరిద్దరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ ఉన్నాడు. భార్యాభర్తలుగా విడిపోయినా, తల్లిదండ్రులుగా కుమారుడి కోసం ఇద్దరూ కలిసి అండగా నిలుస్తున్నారు. 
 
అందుకే పలు సందర్భాల్లో, కుటుంబ వేడుకల్లో కలిసి కన్పించారు. దీంతో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ విడివిడిగా భాగస్వాములను వెతుక్కున్నారని పుకార్లు వస్తున్నాయి. మలైకా అర్జున్‌ కపూర్‌తో సన్నిహితంగా ఉంటోందని, అర్బాజ్‌ గోవాకు చెందిన రెస్టారెంట్‌ ఓనర్‌ ఎల్లో మెహ్రాతో స్నేహం చేస్తున్నాడని  బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజనటికి కోపమొచ్చింది.. సినిమా సెట్స్‌ నుంచి జయసుధ వాకౌట్‌!