Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సామాజిక ప్రయోజనం, బాధ్యతతో మహిషాసురుడు

Bharadwaja, Relangi Narasimha Rao, Gautham Raju and others
, గురువారం, 4 మే 2023 (17:22 IST)
Bharadwaja, Relangi Narasimha Rao, Gautham Raju and others
సామాజిక ప్రయోజనం, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని "మహిషాసురుడు" చిత్రాన్ని మలిచారు. అనిరుధ్, అపరాజిత సమర్పణలో  శ్రీ శివరామ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో వినోద్, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరో హీరోయిన్లుగా  రవికుమార్ గోనుగుంట. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది ముఖ్య అతిధులుగా విచ్చేసిన సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి, రేలంగి నరసింహారావు, గౌతం రాజులు సంయుక్తంగా ఆడియోను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, గౌతం రాజులు మాట్లాడుతూ, ఒక మంచి కంటెంట్ తో, తీసిన ఈ చిత్రం సక్సెస్ కావాలని, పాటలు కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు.
 
సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, ప్రముఖ వైద్యుడైన  డాక్టర్ ఎస్.గురుప్రసాద్ వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సమాజం పట్ల బాధ్యతగా ఒక సందేశాన్ని అందిస్తూ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దీనిని నిర్మించారు.వాస్తవానికి ఆయనకు ఈ సినిమాను నిర్మించాల్సిన అవసరం లేకున్నా, సమాజాన్ని జాగృతం చేయాలన్న తలంపుతో తీశారు" అని చెప్పారు.
 
ప్రధాన పాత్రధారి, చిత్ర నిర్మాత డాక్టర్ ఎస్.గురుప్రసాద్ మాట్లాడుతూ, గుండె మార్పిడి మొదలుకుని అనేక జబ్బులను నయం చేయడం కోసం ఉపయోగించాల్సి వైద్య పరికరాల విషయంలో  మనం ఎంతో వెనుకబడి ఉన్నాం అనిపిస్తుంది. ప్రాణాలను కాపాడే  కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు వాటిని మన దేశంలోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందివచ్చను అనే పాయింట్ తో ఈ సినిమాను తీశాం. మన దేశంలో పరిశోధనలు చేసే సైంటిస్ట్ లకు తగినంత గుర్తింపు లేకపోవడం వల్లే వైద్య పరికరాల విషయంలో మనం ఇంకా విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఈ వాస్తవ అంశాలను సమాజానికి, ప్రభుత్వాలకు తెలియజేయాలనే సంకల్పంతోనే పవర్ ఫుల్ మీడియా అయినా సినిమా ద్వారా అందరికీ చెప్పబోతున్నాం. అలాగే ఫైనాన్స్  కంపెనీల ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకొని,  వాళ్ల ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేక ఎన్నో కుంటుబాలు ఆత్మహత్యలు చేసుకొంటున్నాయి అనే మరో  అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం" అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు రవికుమార్ గోనుగుంట మాట్లాడుతూ, ఎంతో బిజీ కార్డియాలజిస్ట్ అయిన గురుప్రసాద్ కు ఈ సినిమా చెయ్యాల్సిన అవసరం లేదు. సమాజానికి మేలు చేయాలి, తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోగలిగితే  ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలవుతుందన్న ఆయన తపనే ఈ చిత్ర నిర్మానికి మూలం. కుటుంబ అనుబంధాలను సమ్మిళతం చేసి మరీ ఈ చిత్రాన్ని తీశాం. సినిమా చాలా బాగా వచ్చింది' అని అన్నారు.
 
సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ, "తెలుగు తో పాటు పలు ఇతర బాషల చిత్రాలు చేసిన నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంగీతాన్ని అందించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. యూత్ తో పాటు అందరినీ అలరించే అన్ని రకాల పాటలు ఇందులో ఉన్నాయి" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొల్‌కత్తాలో టాక్సీడ్రైవర్‌గా చిరంజీవి షూట్‌ ప్రారంభం