Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా బ్యూటీ సీక్రెట్ ఏంటంటే..? ఫిష్, ఎగ్, చికెన్ ఫుల్లుగా లాగించి..?: మహేష్ బాబు

Advertiesment
Mahesh Babu
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (18:13 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన అందం వెనుక గల రహస్యాన్ని బయటచెప్పేశారు. నాలుగు పదుల్లో కుర్రాడిలా కనిపించే మహేష్ బాబు అందానికి వెనుక సరైన ఆహారం, చక్కని నిద్ర, వర్కౌట్స్ కారణమని చెప్తున్నారు. ఇంకా సంతోషంగా ఉండటం కూడా తన అందానికి కారణమంటున్నారు.

ప్రతిరోజూ వర్కౌట్లు చేయడం.. కడుపు నిండా తిని.. బాగా నిద్రపోవడం చేస్తే అందంగానే కాదు.. హుషారుగానూ కనిపించవచ్చునని ప్రిన్స్ సలహా ఇస్తున్నారు. తన దృష్టిలో వయస్సు పెరగడం అనేది ఓ నెంబర్‌గానే భావిస్తానని.. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని చెప్పాడు. 
 
ఆహారంలో విషయంలో నియమాలు పాటించడం.. ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎంతమేరకు కావాలో అంతే తీసుకుంటానని.. చికెన్, సీఫుడ్స్, ఎగ్ వైట్, ఆకుకూరలు బాగా లాగించడం చేస్తానని మహేష్ బాబు తెలిపారు. ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరమని టాలీవుడ్ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. సింపుల్‌గా ఉండటం, క్యాజువల్ వేర్ ధరించడం అంటే తనకెంతో ఇష్టమని మహేష్ వెల్లడించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రకుల్ ఖాతాలో లేని హిట్టు.. కోటిని దాటని రెమ్యునరేషన్.. బెల్లం కొండ శీనుతో లక్.. ఎలా?