మహేష్ బాబు చేతుల మీదుగా నందిని నర్సింగ్ హోమ్ ఆడియో.. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్
నందిని నర్సింగ్ హోమ్ సినిమా ద్వారా సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈనెల 27న నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతు
నందిని నర్సింగ్ హోమ్ సినిమా ద్వారా సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈనెల 27న నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరుగనుంది. పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాధాకిషోర్, భిక్షం నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నందిని నర్సింగ్ హోమ్ అన్న టైటిల్, ఇక్కడ అంతా క్షేమం అన్న ట్యాగ్‌లైన్ బాగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
కాగా 'నందిని నర్సింగ్ హోమ్' చిత్ర ఫస్ట్‌లుక్ లాంచ్ శనివారం హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో జరిగింది. కృష్ణ, విజయనిర్మల సంయుక్తంగా ఫస్ట్‌లుక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, 'మా ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోగా నవీన్ పరిచయం కావడం ఆనందంగా ఉంది. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డాన్సుల్లోనూ మంచి శిక్షణ తీసుకుని, హీరోకి కావాల్సిన అన్ని విషయాల్లో నైపుణ్యం సాధించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. ఈ నెల 27న మహేష్‌బాబు అతిథిగా ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు, నిర్మాతలకు డబ్బులు రావాలి' అని అన్నారు.