'బాహుబలి2'పై మహేశ్ బాబు కూడా ఏసేశారు... మిగిలింది మెగా పవర్ స్టార్సే...
బాహుబలి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇప్పటివరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనుకునేవారు. కానీ బాహుబలి సృష్టిస్తున్న సునామీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెం.1 స్థానం సాధించే దిశగా వెళుతోంది. బాహుబలి తొలిరోజు వసూళ్లు బా
బాహుబలి బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇప్పటివరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనుకునేవారు. కానీ బాహుబలి సృష్టిస్తున్న సునామీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెం.1 స్థానం సాధించే దిశగా వెళుతోంది. బాహుబలి తొలిరోజు వసూళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తున్నాయి. ఇదే దూకుడుగా ఆడితే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా కనబడటం ఖాయం. దర్శక ధీరుడు రాజమౌళి కష్టానికి ఫలితం దక్కిందంటూ ఆయనను ఇప్పటికే ఎందరో ప్రశంసిస్తున్నారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనే మార్కు టాలీవుడ్‌కు తరళివెళుతుందా అనే స్థాయిలో చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. బాహుబలి చిత్ర యూనిట్‌కు ప్రిన్స్ మహేష్ బాబు కూడా అభినందించాడు. దర్శకుడు రాజమౌళి కథ చెప్పడంలో మాస్టర్ అనీ, బాహుబలి 2 అంచనాలను దాటేసి దూసుకెళ్తోందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే బాహుబలి చిత్ర బృందానికి జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపాడు. ఇక మిగిలింది మెగా పవర్ స్టార్సే....