Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతతో క్లోజ్‌గా ఉండకుంటే అంతే.. నోరు విప్పితే కాపురాలు కూలుతాయ్.. బళ్లారి బ్యూటీ

తాను నోరు విప్పితే అనేక కాపురాలు కూలిపోతాయని బళ్లారి బ్యూటీ, సినీ హీరోయిన్‌ మాధవీలత అంటున్నారు. పైగా, దర్శకుడు, నిర్మాతతో సన్నిహితంగా ఉండాలని, లేనిపక్షంలో ఇక కెరీర్ ముగిసినట్టేనని ఆమె సంచలన ఆరోపణలు చే

Advertiesment
నిర్మాతతో క్లోజ్‌గా ఉండకుంటే అంతే.. నోరు విప్పితే కాపురాలు కూలుతాయ్.. బళ్లారి బ్యూటీ
, గురువారం, 2 మార్చి 2017 (08:57 IST)
తాను నోరు విప్పితే అనేక కాపురాలు కూలిపోతాయని బళ్లారి బ్యూటీ, సినీ హీరోయిన్‌ మాధవీలత అంటున్నారు. పైగా, దర్శకుడు, నిర్మాతతో సన్నిహితంగా ఉండాలని, లేనిపక్షంలో ఇక కెరీర్ ముగిసినట్టేనని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. 
 
వెండితెరపై కనిపించిన అతి తక్కువ సినిమాలతో తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఊపందుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ప్రస్తుతం ఆఫర్స్ లేకపోయినా ఇంటికే పరిమితమైంది. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెరవెనుక జరిగే అనేక విషయాలపై స్పందించింది. సినిమాల్లో అవకాశం ఇస్తామని, కాకపోతే క్లోజ్‌గా ఉండాలని దర్శకనిర్మాతలు షరతులు పెడతారని, వారి మాట ప్రకారం నడుచుకోకుంటే ఇక కెరీర్ ముగిసినట్టేనని తెలిపింది. 
 
నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు నోరువిప్పి నిజాలు చెప్పడం మొదలుపెడితే చాలామంది కాపురాలు కూలిపోతాయంటూ వ్యాఖ్యానించింది. ప్రొడ్యూసర్‌కి క్లోజ్‌గా లేకపోతే ఎలా వేధిస్తారో కూడా వివరించింది. హోటల్ రూం మార్చడం, మేకప్ దారుణంగా ఉంటాయని తెలిపింది. అదేసమయంలో తాను పెళ్లి చేసుకోరాదని నిర్ణయించినట్టు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి జన్మ ధన్యం: ‘బాహుబలి-2’ తొలి ప్రేక్షకురాలు క్వీన్ ఎలిజబెత్ -2