Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా బెడ్ రూం వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకండి.. చేస్తే ఇత్తడైపోద్ది (video)

Advertiesment
నా బెడ్ రూం వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకండి.. చేస్తే ఇత్తడైపోద్ది (video)
, సోమవారం, 3 ఆగస్టు 2020 (08:17 IST)
సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలత బీజేపీ నేతలతో పాటు.. తనను సోషల్ మీడియా వేదికగా చేసుకుని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. నా బెడ్రూమ్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకండి.. చేస్తే ఇత్తడైపోద్ది అంటూ బహిరంగ హెచ్చరికలు చేసింది. అలాగే, బీజేపీ నేతలకు కూడా గట్టిగా కౌంటరిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీజీ స్టైల్‌లో పేరు చెప్పను కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్త‌డైపోద్ది. ఇది పగ కాదు ప్రతీకారం కాదు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. బాధ్య‌త‌రాహిత్యంగా ఉండటం తప్ప‌ని.. కొంద‌రు నేత‌ల‌కు సూచిస్తున్నా అంటూ తన ఎఫ్.బి ఖాతాలో ఓ సుధీర్ఘమైన పోస్టును పెట్టింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా మాధవీలతను లక్ష్యంగా చేసుకుని కొందరు బీజేపీ నేతలతో పాటు.. పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారందరికీ తన స్టైల్‌లో చురకలంటించింది. తన ఎఫ్.బి ఖాతాలో తెలుగులో ఓ పోస్ట్ పెట్టింది. కొంద‌రు బీజేపీ నాయ‌కులు త‌ప్పులు చేస్తున్నార‌ని ఆరోపించారు. 
 
"నేను రెండేళ్ల క్రితం బీజేపీలో చేరాను. నేను పార్టీలో చేరినపుడు ఒక మాట చెప్పాను. ఇపుడు అదే మాట మీద ఉన్నాను. నా పార్టీ అయినా ఎవ‌రైనా తప్పు చేస్తే తప్పే అని బ‌రాబర్ చెప్తా. నన్ను దూరం పెడతారు అనే భయం లేదు. దూరం అవుతా అన్న బెంగ అంతకంటే లేదు. నేనెపుడు దేశం కోసం, ధ‌ర్మం కోసం పని చేస్తాను. మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు. సమయం సందర్భం చూసి ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో. చెప్పేస్తా. మోడీజీ స్టైల్‌లో పేరు చెప్పను కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్త‌డైపోద్ది. ఇది పగ కాదు ప్రతీకారం కాదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. బాధ్య‌త‌రాహిత్యంగా ఉండటం తప్ప‌ని.. కొంద‌రు నేత‌ల‌కు సూచిస్తూ సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టింది.
 
అంతేకాదు త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోల్స్ చేస్తున్న వారికి రిప్లై ఇస్తూ..ప్ర‌జ‌ల‌కు వ్య‌క్తిగ‌త జీవితంలోకి ప్ర‌వేశించ‌డం ఫ్యాష‌న్ గా మారిపోయింది. నా బెడ్ రూం దాకా వెళ్లే ధైర్యం చేయొద్దు..వెళ్తే  ఎలా స్పందించాలో నాకు తెలుసున‌ని మాధ‌వీల‌త  మ‌రో పోస్ట్ పెట్టారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియా చక్రవర్తి ఫ్యామిలీ మిస్సింగ్... అర్థరాత్రి సూట్‌కేసులతో జంప్???