Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదికి సంతోషాన్ని క‌లిగించిన మాధ‌వ‌న్‌

మోదికి సంతోషాన్ని క‌లిగించిన మాధ‌వ‌న్‌
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (20:08 IST)
Modi, madhav, Nambi
సినీన‌టుడు రంగ‌నాథ‌న్ మాధ‌వ‌న్ ఇటీవ‌ల ఢిల్లీవెళ్ళి ప్ర‌ధాని మోడీని క‌లిశారు. గొప్ప శాస్త్రవేత్త నంబి నారాయ‌ణ‌న్‌తో క‌లిసి ఆయ‌న పి.ఎం.ని క‌లిశారు. అనంత‌రం మోదీ, మాధ‌వ‌న్‌కు సోష‌ల్‌మీడియాలో ట్వీట్ చేస్తూ, మిమ్మ‌ల్ని, నంబి నారాయణన్ జిని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఎంతోమంది శాస్త్రవేత్త‌లు, సాంకేతిక నిపుణులు మన దేశం కోసం గొప్ప త్యాగాలు చేసారు, మీరు చూపిన  'రాకెట్రీ`లోని ప‌లు విష‌యాలు నన్నెంగ‌తానో ఆక‌ట్టుకున్నాయి. ఈ విష‌యాల‌ను దేశంలో యువ‌త తెలుసుకోవాల‌ని` పేర్కొన్నారు.
 
వివ‌రాల్లోకి వెళితే, భారతదేశంలో గొప్ప స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్. కానీ ఆయ‌న జీవితంలో కొన్ని కుట్ర‌లు జ‌రిగాయి. అనేక అవ‌మానాల‌కు ఆయ‌న గుర‌య్యారు. అయినా ధైర్యంతో ముందుకు సాగారు. ఇప్పుడు ఆయ‌న జీవితాన్ని సినిమాగా తీశారు. నంబియార్ పాత్ర‌ను మాధ‌వ‌న్ పోషించారు. ఆ సినిమా పేరు 'రాకెట్రీ`. నంబి నారాయ‌ణ‌న్ గురించి పూర్తిగా స్ట‌డీ చేసిన మాధ‌వ‌న్ ఆయ‌నే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈమ‌ధ్య‌నే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. దీన్ని దేశంలో అన్ని భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి మోదీకి తెలిపి ఆయ‌న స‌పోర్ట్ తీసుకోవాల‌ని మాధ‌వ‌న్ చూశారు. అది ఇటీవ‌లే నెర‌వేరింది. కొన్ని వారాల క్రితం సైంటిస్ట్ నంబి నారాయణన్ తో కలిసి మాధవన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సినిమా రూపకల్పన వెనుక ఉన్న విశేషాలను, వివరాలను మోదీకి తెలియచేశారు. మూవీకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ సందర్భంగా నంబి నారాయణన్ కు జరిగిన అన్యాయంపై మోదీ సానుభూతిని తెలిపారని మాధవన్ చెప్పారు. ఈ విష‌యాల‌న్నింటినీ మాధ‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌చేశాడు. ఆ వెంట‌నే మోదీ దానికి స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎర్ర చీర‌`లో తొలి తొలి ముద్దు సాంగ్ ఆవిష్క‌రించిన‌ మారుతి