Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మిన్'' అంటే మీ (నేను)-నిమ్ అంటే యు (మీరు).. ''కిలికి'' భాష గురించి మదన్ కార్కీ ఏమన్నారంటే?

బాహుబలి బిగినింగ్‌లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ పలికిన పలుకులు బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎవరికీ అర్థంకాని 'కిలికి' భాషలో అతగాడి డైలాగ్స్ వండర్ అనిపించాయి. బాహుబలి చిత్రం రెండు తమిళ వెర్షన్స్‌కు ల

Advertiesment
Madan Karky
, ఆదివారం, 14 మే 2017 (14:12 IST)
బాహుబలి బిగినింగ్‌లో కాలకేయ పాత్రధారి ప్రభాకర్ పలికిన పలుకులు బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎవరికీ అర్థంకాని 'కిలికి' భాషలో అతగాడి డైలాగ్స్ వండర్ అనిపించాయి. బాహుబలి చిత్రం రెండు తమిళ వెర్షన్స్‌కు లిరిక్స్, డైలాగ్స్ రాసిన మదన్ కార్కి కొత్త విశేషాలు తెలిపారు. ఓ గిరిజన తెగ మాట్లాడే భాషలోని కొన్ని పదాలు తీసుకుని.. ఈ భాష సృష్టించినట్లు వెల్లడించారు.
 
రెండేళ్ల క్రితం తాను ఈ ఐడియా గురించి దర్శకుడు రాజమౌళికి వివరించానని మదన్ కార్కి ఓ ఇంగ్లీష్ డైలీకి తెలిపారు. ''ది లార్డ్ ఆఫ్ రింగ్స్'' సిరీస్‌లోని ఎల్విష్, స్కార్ ట్రెక్ సిరీస్‌లోని క్లింగాన్, ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్‌లోని వేలిరన్ మూవీల్లో ఇలాంటి సాహిత్యం వున్నట్లు గుర్తించానని తెలిపారు. 
 
ఆరేళ్ల క్రింత తాను ఆస్ట్రేలియాలో పిహెచ్‌డి చేస్తున్నప్పుడు పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా, బేబీ సిట్టర్‌గా పనిచేశానని.. ఆ సందర్భంగా వివిధ భాషల్లోని తేడాలను వారికి వివరించేవాడనని కార్కి చెప్పారు. ఉదాహరణకు.. 'మిన్' అంటే మీ (నేను) అని, నిమ్ అంటే యు (మీరు) అని.. అలా కొన్నింటిని కలగలిపి వందపదాలు నోటిమాటలుగా రూపొందించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో సినిమా తీసేందుకు రెడీ అవుతున్న బిచ్చగాడు దర్శకుడు..!