Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు

చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. స్టార్‌ టీవీ వారు కొనుగోలు చేసేశారు. కానీ అప్పటి నుంచి పేరు మారలేదు. 'మా' అనేది బ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడంతో సమయం చూసి మార్చాలని నిర్ణయించారు. అం

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:25 IST)
చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. స్టార్‌ టీవీ వారు కొనుగోలు చేసేశారు. కానీ అప్పటి నుంచి పేరు మారలేదు. 'మా' అనేది బ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడంతో సమయం చూసి మార్చాలని నిర్ణయించారు. అందుకు ఈ సోమవారం ముడిపడింది. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానున్న సందర్భంగా 'మా'టీవీ పేరును స్టార్‌ అనే పేరు ముందుకు రావడం జరిగింది. కొత్త లోగో, బ్రాండ్‌ ట్యాగ్‌లైన్‌, న్యూ మోనిక్‌ థీమ్‌ ట్రాక్‌ను ఆదివారంనాడు చిరంజీవి ఆవిష్కరించారు. 
 
ఇకపై కొత్తగా కనిపించబోతున్న స్టార్‌ మా లోగో కొత్త రూపం ఎరుపు రంగులో ప్రస్పుటంగా కనపించబోతుంది. అంతర్గతంగా మా అనే అక్షరాలు బోల్డ్‌గా కనిపించనున్నాయి. అదే బంధం.. సరికొత్త ఉత్తేజం అనే ట్యాగ్‌లైన్‌ ప్రకటించారు. 
 
ఈ కార్యక్రమంలో స్టార్‌ ఇండియా సౌత్‌ ఇండియా సి.ఇ.ఒ కెవిన్‌ వాజ్‌ మాట్లాడుతూ... తమ బ్రాండ్‌ను నిర్మించుకోవాలనే స్టార్‌ లక్ష్యంలో భాగంగానే మా టీవీని సొంతం చేసుకున్నాం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా ఛానల్‌ను తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా ప్రోగ్రామింగ్‌లో కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తామని అన్నారు.
 
చిరంజీవి మాట్లాడుతూ ... తొమ్మిదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు నన్ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని అనుకున్నాను. కానీ నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు 150వ సినిమాతో నాకు దిగ్విజయమైన విజయాన్ని అందించారు. తెలుగు ప్రేక్షకులు ఒకసారి అభిమానిస్తే, ప్రేమిస్తే ఎప్పటికీ మరచిపోరు అని మరోసారి ప్రూవ్‌ చేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అడుగుపెడుతున్నాను. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో అడుగుపెడుతున్న నేను ఈ షో చేసేటప్పుడు ఎమోషనల్‌గా అనేక అనుభూతులకు లోనయ్యాను. ఈ ప్రోగ్రామ్‌ పేదవాడి నుండి డబ్బున్నవారి వరకు చాలామందిని కలవడంతో చాలా రకాలైన అనుభవాలను షేర్‌ చేసుకున్నాను. ఇదొక ఎంటర్‌టైన్మెంట్‌ ప్రోగ్రామ్‌ కాదు..ఎమోషనల్‌ ప్రోగ్రామ్‌. అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని