సన్నీ లియోన్ సరికొత్త వ్యాపారం... బ్రాండ్ పేరు లస్ట్...
పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తెల్లతోలు సుందరి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ నటిగా స్థిరపడింది. అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. అపుడపుడూ ఐటమ్ భామగానూ
పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తెల్లతోలు సుందరి సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ నటిగా స్థిరపడింది. అడల్ట్ కామెడీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. అపుడపుడూ ఐటమ్ భామగానూ అవతారమెత్తి తన అందచందాలను ఆరబోస్తోంది. అంతేనా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ ముందుకు సాగిపోతోంది.
తాజాగా సొంతంగా పర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. పంజాబీ మూలాలున్న ఈ కెనడా సుందరి, తన ఇమేజ్‌కి సరిపడా ఉండాలనుకుందో ఏమోగానీ దీనికి 'లస్ట్' అని నామకరణం చేసింది. ఈ వ్యాపారం వల్ల సన్నీకి అదనపు లాభం కూడా ఉంది. అదే పబ్లిసిటీ.. ఓ ఉత్పత్తిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళేందుకు విస్తృతంగా ప్రచారం చేయనుంది. ప్రత్యేకించి మోడల్‌తో ప్రచారం చేయించకుండానే తానే ఆ పని చేసి తన బ్రాండ్ బాగా అమ్ముడుపోయేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.