"లవర్స్ క్లబ్" ఫస్ట్ లుక్
ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణిలు జంటగా మొట్టమొదటిసారిగా ఎమెషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం లవర్స్ క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్‌టైన్మెంట్స్, శ
ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణిలు జంటగా మొట్టమొదటిసారిగా ఎమెషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం లవర్స్ క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్‌టైన్మెంట్స్, శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పైన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీలుక్ ఇప్పటికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా, ఇప్పుడు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సంక్రాంతి తరువాత ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేస్తారు. పక్కా యూత్‌ఫుల్ ఎమెషనల్ లవ్‌స్టోరిగా యువతని ఆకట్టుకుంటుంది.
ఈ సందర్బంగా నిర్మాత భరత్ అవ్వారి మాట్లాడుతూ.. 2016లో పెద్ద చిత్రాలు ఏ రేంజిలో సూపర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజి విజయాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియన్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మనుగడకి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా లవర్స్ క్లబ్‌ని తెరకెక్కించాం. కొత్త వారితో చేసినా మెచ్యురిటిగా మా దర్శకుడు ధృవ శేఖర్ పర్ఫార్మన్సెస్ రాబట్టుకున్నారు అని చెప్పారు.