ఐ లవ్ యు వెనుక వుండే ఫార్ములా అంతా మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్స్ అని చెపుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రేమ అనేది లైంగిక ఆకర్షణ వల్ల పుడుతుంది తప్ప మరొకటి కాదంటున్నారు. అకస్మాత్తుగా ఓ రోజు ప్రేమ పుట్టింది అంటాం. ఆ తర్వాత ప్రేమించడం, పెద్దలకు చెబితే ఏం చేస్తారోననీ ఇంట్లో నుంచి పారిపోవడం చేస్తాం.
పెద్దలు మాత్రం ఏం చేస్తారు... చేసేదేమీ లేక ఇద్దరు నెత్తిన అక్షింతలు వేసి వెళ్లిపోతారు. ఆహా అయిపోయిందిలే అనుకుంటాం కానీ అప్పుడు అసలు వ్యవహారం ప్రారంభమవుతుంది. ఇద్దరి సరదా తీరిపోతుంది. అంతకుముందు ప్రేమా... ప్రేమా అంటూ పడిచచ్చిన ప్రేమ ఎటు పోతుందో తెలీదు. ఎగిరిపోతుంది. ఇదంతా మెదడు చేసే మ్యాజిక్.
సంతోషం వస్తే దేవుడా ఈ సంతోషాన్ని ఇలాగే వుండనివ్వు అని కోరుకుంటాం. కష్టాలు వస్తే దేవుడా ఇవి నాకు లేకుండా చేయి అంటాం. అవన్నీ దేవుడికి తెలుసు. కానీ మెదడు చేసే మేజిక్కులన్నిటికీ ఆయన సపోర్ట్ చేయడానికి దేవుడేమైనా పిచ్చోడా ఏంటి? అందుకే ప్రతిది దేవుడు ముందు మొక్కకండి అని చెప్పారు పూరీ జగన్నాథ్. మరి పూరీ లాజిక్ పైన మీ ఆలోచన ఏమిటో చెక్ చేసుకోండి.