Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిటిల్ మిస్ నైనా ETV విన్‌లో 96 ఫేమ్ గౌరీ కిషన్ మ్యూజికల్ రొమాన్స్

Advertiesment
Little Miss Naina

డీవీ

, గురువారం, 25 జనవరి 2024 (15:43 IST)
Little Miss Naina
తమిళంలో 96 (తెలుగులో జాను) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో స్కూల్ అమ్మాయిగా కనిపించి, నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్నారు గౌరీ కిషన్. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లిటిల్ మిస్ నైనా ETV విన్‌లోకి వచ్చింది. ఇందులో షేర్షా షెరీఫ్ మెయిన్ లీడ్‌గా నటించారు.

నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో రాబోతోంది. నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఉండబోతోంది.
 
అభిజిత్‌కి సినిమా అంటే పెద్ద ప్యాషన్ అయితే, OCD సమస్య ఉన్న అమ్మాయికి చదువులంటే ప్రాణం.  ఈ ఇద్దరి మధ్య ప్రేమ కథ ఎలా సాగింది? వచ్చిన సమస్యలు ఏంటి? అనేది ఎంతో వినోదభరితంగా చూపించారు. 96 ఫేమ్ గోవింద్ వసంత అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్, సుతిన్ సుగతన్ నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 25 నుంచి ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ETV విన్‌లో ప్రసారం అవుతుంది. కాబట్టి మీ ప్రియమైన వారితో కలిసి దీన్ని చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంబర్ గేమ్ నమ్మను - కెప్టెన్ మిల్లర్ లాంటి కథను నమ్ముతా : ప్రియాంక అరుల్ మోహన్