Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంక్ కొట్టినా ఫస్ట్ మార్కు నాదే.. నీవల్ల కాదంటే కసితో సాధిస్తా అంటున్న బ్యూటీ

చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అని ఎవరైనా అని రెచ్చగొడితే దాన్ని సాదించే వరకూ నిద్రపోయేదాన్ని కాదని, ఆ మొండిపట్టుదల ఇప్పటికీ తనను విడిచి పెట్టలేదని అంటున్నారు శ్రుతిహసన్. జీవితంలో దేనికీ భయపడకుండా ఉండటం నాన్న నుంచే నేర్చుకున్నానని, ఆ స్ఫూర్తితోనే

బంక్ కొట్టినా ఫస్ట్ మార్కు నాదే.. నీవల్ల కాదంటే కసితో సాధిస్తా అంటున్న బ్యూటీ
హైదరాబాద్ , శనివారం, 22 ఏప్రియల్ 2017 (04:24 IST)
చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అని ఎవరైనా అని రెచ్చగొడితే దాన్ని సాదించే వరకూ నిద్రపోయేదాన్ని కాదని, ఆ మొండిపట్టుదల ఇప్పటికీ తనను విడిచి పెట్టలేదని అంటున్నారు శ్రుతిహసన్. జీవితంలో దేనికీ భయపడకుండా ఉండటం నాన్న నుంచే నేర్చుకున్నానని, ఆ స్ఫూర్తితోనే సాధించాలన్న కసి నాలో ఎప్పుడూ ఉంటుందని అంటున్నారీమె. ప్రస్తుతం లండన్‌లో సంఘమిత్ర సినిమా షూటింగ్‌లో కత్తి యుద్ధం సన్నివేశంలో పాల్గొంటున్న శ్రుతిహసన్ చిన్ననాటి పట్టుదల కొనసాగుతున్నందువల్లే కష్టమైన పాత్రలో నటించాల్సి వస్తే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా అన్న సంకోచం కలగదని, కచ్చితంగా చేయగలనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళతానని ధీమా వ్యక్తం చేస్తోంది.
 
పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎక్కువగా సంగీతం, ఇతర కాలక్షేప అంశాలపైనే ఆసక్తి చూపడంతో చదువును నిర్లక్ష్యం చేసేదాన్ని కానీ పరీక్షలు దగ్గర పడగానే రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు తెసుకునేదాన్ని. మరొకరైతే మొదటి నుంచి చదవలేదు ఇప్పుడు చదివి ఏం మార్కులు తెచ్చుకుంటాంలే అని నిరాశకు గురవుతారు. నేనలాకాదు, అలాంటి పట్టుదలతోనే సినిమారంగంలోకి ప్రవేశించాను. శ్రమిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాంటి ధైర్యంతోనే నటినయ్యా. ఇప్పుడు సినిమా నాకు చాలా మంచి చేస్తోంది అని చెప్పింది శ్రుతి.
 
నటిగా ఆదిలో అపజయాలను చవిచూసినా, ఆ తరువాత విజయాల బాట పట్టిన శ్రుతీ నేడు భారతీయ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్న నాయకి.తొలి చిత్రంలోనే గ్లామర్‌ విషయంలో(హిందీ చిత్రం లక్‌) చాలా బోల్డ్‌గా నటించి పలు విమర్శలను మూటకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత కూడా అందాలారబోత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి రెమ్యునరేషన్ 75 కోట్లా.. నిర్మాతల నుంచి బాగానే పిండాడు మరి..