Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా లవ్వాట

Krish Bandipalli, Meera Kannan
, మంగళవారం, 24 మే 2022 (18:20 IST)
Krish Bandipalli, Meera Kannan
ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం "లవ్వాట". నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "రావణలంక" ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో సీనియర్ నటులు బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
 
జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. కాన్సెప్ట్ కు తగిన మంచి టైటిల్ సూచించమంటూ సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన మానే రామారావు "లవ్వాట" టైటిల్ లోగో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, మూసా అలీఖాన్, ధీరజ అప్పాజీ, "రుద్రాక్షపురం" నిర్మాత కొండ్రాసి ఉపేందర్ లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
 "లవ్వాట"లో తానొక కీలక పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడిగా గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఉందని బెనర్జీ పేర్కొన్నారు. సురేష్ కొండేటి-మూసా అలీఖాన్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. "లవ్వాట" చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
 
హీరో క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ... గాంధీ చెప్పిన కథ వింటే నేనే కాదు... ఎంత పెద్ద యువ హీరో అయినా టక్కున ఓకే చెబుతారు. సబ్జెక్ట్ విని స్పెల్ బౌండ్ అయిపోయాను" అన్నారు. "లవ్వాట"లో హీరోయిన్స్ గా నటించే అవకాశం రావడం పట్ల హీరోయిన్లు మీరా, దీక్ష సంతోషం వ్యక్తం చేశారు.
 
చిత్ర దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ... "నా ఫస్ట్ ఫిల్మ్ "ప్రేమభిక్ష" విడుదల కాకుండానే... నా మూడో చిత్రం "లవ్వాట" ప్రి-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని టైటిల్ లాంచ్ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. నా మొదటి, రెండవ చిత్రాలు "ప్రేమభిక్ష, రుద్రాక్షపురం" పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రేమ పట్ల నేటితరం దృక్పథం ఎలా ఉన్నదో వినోదాత్మకంగా వివరిస్తూ సాగే చిత్రమిది. తెలుగుతోపాటు తమిళ-కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాం. ఈ అవకాశమిచ్చిన నిర్మాతలకు, ప్రోత్సహిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు" అన్నారు.
 
 థ్రిల్లర్ మంజు, ఢిల్లీ మురళి, అప్పాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఫైట్స్: థ్రిల్లర్ మంజు-బాజి, ఛాయాగ్రహణం: ఎమ్.నాగేంద్ర, సంగీతం: జి.కె, ఎడిటింగ్: మల్లి,  నిర్మాతలు: ఎన్. వెంకటేశ్వర్లు- బొట్టా శంకర్రావు -వెంకటగిరి శ్రీనివాస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆర్.కె.గాంధీ!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా కుమారస్వామి సమర్పణలో యష్ చిత్రం లక్కీ స్టార్