Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పోరగాడు.. అంటున్న "లావణ్య విత్ లవ్‌బాయ్స్"

'పిల్లజమీందార్', 'పెద్దరికం', 'భైరవద్వీపం', 'సోగ్గాగే చిన్ని నాయనా' చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'లావణ్య విత్ లవ్‌బాయ్స్' చిత్రం పాటల రికార్డింగ

సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పోరగాడు.. అంటున్న
, శుక్రవారం, 20 జనవరి 2017 (09:39 IST)
'పిల్లజమీందార్', 'పెద్దరికం', 'భైరవద్వీపం', 'సోగ్గాగే చిన్ని నాయనా' చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'లావణ్య విత్ లవ్‌బాయ్స్' చిత్రం పాటల రికార్డింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజ్యలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మీ.సి, నర్సింలు పటేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా.కె.వీ.రమణాచారి స్వీచ్ అన్ చేయగా, యశోకృష్ణ సంగీత నిర్దేశకత్వంలో సిరిసిల్ల తల్లిగారు.. సిద్దిపేట అత్తగారు.. కట్టుకున్న పొరగాడు.. నప్పతట్ల నారిగాడు.. అందమంత ఏం జేత్తురో?... అడవిలోని యెన్నెలైతిరో...? అనే పల్లవితో కొనసాగే పాటను ఈ సందర్భంగా తొలిపాటగా రికార్డ్ చేశారు. 
 
ఈ సందర్భంగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో మలి చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కె.వి.రమణాచారి శుభాకాంక్షలు అందజేశారు. దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ కాలేజీ నేపథ్యంలో ఒక అందమైన అమ్మాయి, ముగ్గురబ్బాయిల మధ్య కొనసాగే హాస్యరస ప్రేమకథా చిత్రమిది. రియల్‌లవ్ అంటే ఏమిటో తేల్చిచెప్పే సందేశాత్మక చిత్రమిది. 
 
ఈ చిత్రాన్ని సర్వజనరంజకంగా తీర్చిదిద్దుతాననే నమ్మకం వుంది. ఫిబ్రవరి 9 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీమోహన్, కెమెరామెన్ తోటరమణ, ప్రముఖ నిర్మాత సంగిశెట్టి దశరథ, సంగీత దర్శకుడు యశోకృష్ణ, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి ముఖ్య అతిథిగా విజయేంద్రప్రసాద్ 'శ్రీవల్లి' ఆడియో వేడుక