Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైన - సుగ్రీవ

రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైన - సుగ్రీవ
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (18:17 IST)
Sugreeva movie clap BVS ravi
వంశీ, అనిల్, కృష్ణ ప్రియ హీరోహీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న‌ చిత్రం ‘సుగ్రీవ’. విక్రమ్ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి నగేష్ దర్శకత్వలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రచయిత-దర్శకుడు బివిఎస్ రవి క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నటుడు మహేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, దర్శకుడు కొత్తపల్లి నగేష్ ఇదివరకే చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మా తొలి నిర్మాణంలో ‘సుగ్రీవ’ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర కథ చాలా బాగుంటుంది. అందరూ మెచ్చే కథతో వస్తున్నాం.. ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు.
 
webdunia
Sugreeva movie script
దర్శకుడు కొత్తపల్లి నగేష్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా ఇది మ్యూజికల్ చిత్రం అని చెప్పొచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నాం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ కృష్ణ ప్రియ ఖరారు కాగా మరో ప్రధాన హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. మిగతా విషయాలు త్వరలోనే ప్రకటిస్తాం’’ అని అన్నారు.
 
హీరో వంశీ మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నా.. ‘సుగ్రీవ’ కథ చాలా బాగుంది. నాకెంతో నచ్చింది అని తెలిపారు.
హీరోయిన్ కృష్ణ ప్రియ, మరో హీరో అనిల్‌తో పాటు రవి, ఉమంత కల్ప, కృష్ణ, లెనిన్ సింహ, కృష్ణ కాంత్, చిట్టి, శేకింగ్ శేషు, ప్రముఖ నిర్మాత రవి పైడిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
వంశీ, అనిల్, కృష్ణ ప్రియ, తనికెళ్ల భరణి, ఆనంద్ చక్రపాణి, ‘ఆర్‌ఎక్స్ 100’ కరణ్, పార్వతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః రవి. వి, కొరియోగ్రఫీ: జిత్తు, సాహిత్యంః కృష్ణకాంత్, నిర్మాతలు: మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి, కథ- స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కొత్తపల్లి నగేష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సీజన్ 5: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బర్త్ డే స్పెషల్.. తండ్రి విషెస్‌తో..?