Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునీల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ల్యాండ్ మాఫియా రాబోతుంది

Sunil Kumar Reddy, Pranayanatha, Madhubala
, మంగళవారం, 2 జనవరి 2024 (17:01 IST)
Sunil Kumar Reddy, Pranayanatha, Madhubala
ప్రణయనాథ, మధుబాల హీరో హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘ల్యాండ్ మాఫియా’. ఈ చిత్రానికి బాబు వీఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమా గంగ పుత్రులు ఫేమ్ సునీల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో విడుదలకాబోతుంది.
 
సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ ఎక్కాలి రవీంద్ర బాబు వల్ల ఈ టీంను కలిశాను. నా ఫ్రెండ్ రవీంద్ర చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపించాను. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ "తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరిస్తారు. ఈ ల్యాండ్ మాఫియా చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు చూసి మంచి విజయవంతం చేస్తారు అని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు
 
హీరో, నిర్మాత ప్రణయ నాథ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రంగా మొదలైన ఈ ప్రాజెక్టు పెద్ద సినిమా గా మారింది. మొదటి నుంచి మాకు శ్రావ్య ఫిల్మ్స్ అండగా నిలబడింది. అన్ని విధాలుగా మాకు సహకరించారు. ఓ మంచి చిత్రాన్ని తీశాం. త్వరలోనే మా ల్యాండ్ మాఫియా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు
 
మధుబాల మాట్లాడుతూ.. ‘ఇంత మంచి పాత్రను పోషించాను. మా సినిమా ఇప్పుడు ఇక్కడ వరకు రావడం నాకు ఆనందంగా ఉంది. సందేశాత్మక చిత్రం తో పాటు అన్ని రకాల కమర్షియల్ అంశాలుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.
 
డైరెక్టర్ బాబు మాట్లాడుతూ.. ‘మా నిర్మాత ప్రణయనాథ ఎంతో సహకరించారు. ఖర్చుకి ఎక్కడా వెనకడుగు వేయలేదు. సునీల్ కుమార్ రెడ్డి గారి సహకారం వల్లే సినిమాను పూర్తి చేశాం. సినిమా టీం అంతా కూడా ఎంతో సహకరించారు. డీఓపీ వెంకట్ గారు, ఎడిటర్ కృష్ణ గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వారంతా ముందుండి మమ్మల్ని నడిపించారు. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బూట్‌ కట్ బాలరాజు బ్యాచ్ ఏమిచేస్తారో తెలుసా !