Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుండెపోటుతో 24 ఏళ్లలోనే మలయాళ నటి లక్ష్మీకా మృతి

Advertiesment
Lakshmika Sajeevan
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (18:38 IST)
Lakshmika Sajeevan
వర్ధమాన మలయాళ సినీతార, టెలివిజన్ నటి లక్ష్మీకా సజీవన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కి గురి చేసింది. 
 
"‘కాక్క"షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మీకకు మంచి పేరు వచ్చింది. ఆమె పంచవర్ణతత, సౌదీ వెల్లక్క, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాధక్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్మర్ సల్మాన్ వంటి చిత్రాలలో నటించారు.
 
నవంబర్ 2న లక్ష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సూర్యాస్తమయానికి సంబంధించిన అందమైన ఫోటోను షేర్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్యభామ సినిమాలో అమరేందర్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర