Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో లక్ష్ చదలవాడ ధీర టీజర్ తో ఆకట్టుకున్నాడు

Advertiesment
Laksh Chadalavada, dheera

డీవీ

, శుక్రవారం, 12 జనవరి 2024 (17:06 IST)
Laksh Chadalavada, dheera
లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. ‘ధీర’ అంటూ పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ధీర గ్లింప్స్ ఆల్రెడీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ధీర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ను గమనిస్తే డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇక మాస్, యాక్షన్ హీరోగా లక్ష్ ఆకట్టుకునేలా ఉన్నాడు. ‘డబ్బంటే నీకు ఎందుకంత పిచ్చి’.. ‘ప్రపంచమంతా ఇంత కమర్షియల్ టు ది కోర్ నా కొడుకులు ఉంటే నన్ను కమర్షియల్ అంటావేంటే?’.. ‘మావోడు కథలు చెప్తే రియలో, ఫేకో అతను చెప్తే తప్పా తెలియదు.. అలాంటిది అతనికే కథలు చెప్తావేంట్రా’.. ‘అంబులెన్స్ వెనకొస్తే సైడ్ ఇవ్వాలి.. నాలాంటోడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి.. కాదని గెలికితే.. ఒక్కొక్క నా కొడుక్కి ఇచ్చి పడేస్త’ అనే డైలాగ్స్ టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి.
 
ధీర మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైడర్‌ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ ప్రకటించిన కల్కి 2898 AD నిర్మాతలు