Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాల్‌పై సస్పెన్షన్ వేటు వెనక్కి.. నిర్మాతల సంఘం ఎన్నికల్లో ఖుష్భూకు పోటీగా రాధికా సై...

సినీ నిర్మాతల సంఘం ఎన్నికలు జోరందుకునేలా ఉన్నాయి. ఇప్పటికే సినీ నిర్మాతల సంఘం నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ నటుడు విశాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు రావ

Advertiesment
Kushboo
, మంగళవారం, 3 జనవరి 2017 (14:43 IST)
సినీ నిర్మాతల సంఘం ఎన్నికలు జోరందుకునేలా ఉన్నాయి. ఇప్పటికే సినీ నిర్మాతల సంఘం నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ నటుడు విశాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్‌ను విచారణకు రావడంతో నిర్మాతల సంఘం తరపున హాజరైన న్యాయవాది విశాల్  సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీనితో హైకోర్టు న్యాయమూర్తి కళ్యాణసుందరం విశాల్ తదుపరి సంజాయిషీని తెలపాలంటూ నోటీసు జారీ చేశారు. దీంతో నిర్మాతల సంఘం విశాల్ విషయంలో మెట్టు దిగినట్లైంది. 
 
ఈ నేపథ్యంలో నిర్మాతల ఎన్నికల సంఘం ఎన్నికల్లో విశాల్ ఖుష్బూను తమ తరపు అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ప్రత్యర్థి కూటమి అయిన శరత్ కుమార్ సతీమణి, నిర్మాత రాధికా శరత్ కుమార్ ఖుష్బూతో పోటీకి సై అనేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
తమిళ సినీ నిర్మాతల సంఘం ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి జరగుతాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో ఎస్ థాను టీమ్ గెలిచింది. వీరి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో నిర్మాతల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టి.రాజేందర్-శివ టీమ్‌లు బరిలోకి దిగనున్నాయి. ఇటీవల నిర్మాతల సంఘం నుంచి విశాల్‌ను తొలగించారు. అయినప్పటికీ నిర్మాతల సంఘం తాజాగా సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం ద్వారా విశాల్‌కు రూట్ క్లియర్ అయ్యింది. 
 
ఈ నేపథ్యంలో ఖుష్బూను బరిలోకి దించనున్నట్లు విశాల్ ఇప్పటికే ప్రకటన చేశారు. తద్వారా నిర్మాతల సంఘానికి ఓ మహిళ అధ్యక్షత వహించినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే ఖుష్బూకు పోటీగా నడిగర్ సంఘం ప్రత్యర్థి శరత్ కుమార్ తన భార్య, నటి అయిన రాధికను రంగంలోకి దించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే నడిగర్ సంఘం ఎన్నికల తరహాలో.. నిర్మాతల సంఘం ఎన్నికలు కూడా వాడీవేడిగా రసవత్తరంగా జరుగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రత్తాలు' బికినీ వేస్తే అదిరిపోవాల్సిందే... టూపీస్ దుస్తుల్లో లక్ష్మీరాయ్ హంగామా