Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ.. నా నిర్ణయమే.. విశాల్‌ది కాదు: ఖుష్భూ

సీనియర్ నటి ఖుష్భూ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని విశాల్‌ ప్రకటించడం అంతటా చర్చనీయాంశంగ

Advertiesment
Kushboo joins Vishal team to contest in Producers Council Election
, బుధవారం, 4 జనవరి 2017 (09:54 IST)
సీనియర్ నటి ఖుష్భూ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీచేయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని విశాల్‌ ప్రకటించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. విశాల్‌ను నిర్మాతల మండలి నుంచి తొలగించిన కారణంగానే పంతానికి ఈ పనిచేస్తున్నాడని పలువురు విమర్శి స్తున్న నేపథ్యంలో... తను ఎందుకు పోటీచేస్తున్నానో ఖుష్బూ వెల్లడించారు. 
 
దీనిపై ఖుష్బూ మాట్లాడుతూ... నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీచేయాలన్న నిర్ణయం తనదేనని చెప్పారు. విశాల్‌ది కాదని.. ఇతరులు ఏం మాట్లాడుతారో తనకు అనవసరమని.. సినీ పరిశ్రమకు మంచి జరగాలన్నదే తమ ఆశయమని వెల్లడించారు. అందుకే తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 
 
విశాల్‌ ఆడుతున్న ఆటలో తనను పావుగా చేశారని కొంతమంది భావిస్తున్నారని, తాను బాగా చదువుకున్న.. లోకజ్ఞానం తెలిసిన మహిళని.. తాను నిర్ణయాలు తాను తీసుకోగలనని.. విశాల్ కోసమే తాను పోటీ చేయడం లేదని ఘాటుగానే ఖుష్భూ బదులిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద సినిమా చేశాక.. ఈగో వచ్చింది.. ఇండస్ట్రీ నా వెంటపడుతుందనుకున్నా.. : బుర్రా సాయిమాధవ్‌